Breaking News

గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి

Published on Sat, 01/31/2026 - 05:27

జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో శుక్రవారం గొంతులో అన్నం ముద్ద అడ్డుపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. పట్టణంలోని మార్కండేయపురం జగనన్న ఎల్‌–3 లేఅవుట్‌ కాలనీలో ర్యాలీ ఆంజనేయకుమార్, భాను శిరీష దంపతులు. వారికి జెస్సీ (2) అనే కుమార్తె ఉంది. శుక్రవారం జెస్సీ తల్లి భాను శిరీష, నాన్నమ్మ వెంకట రమణ పనిమీద పట్టణానికి వచ్చారు. 

మధ్యాహ్న కావడంతో జెస్సీ తండ్రి ఆంజనేయకుమార్‌ అన్నం కలిపి చిన్నారికి తినిపిస్తున్నాడు. ఆ సమయంలో చిన్నారికి అన్నం ముద్ద గొంతు నుంచి దిగక ఉక్కిరిబిక్కిరైంది. దీంతో తండ్రి పక్కనే నివసిస్తున్న వరాల దుర్గను పిలిచాడు. ఆమె వచ్చి చిన్నారికి సపర్యలు చేసింది. అయినా బాలిక స్పృహ కోల్పోయింది. 

వెంటనే ఆంజనేయకుమార్‌ అక్కంపేటలో ఉంటున్న తన అక్క మాటూరి పద్మావతి, బావ రాంబాబులకు ఫోన్‌ చేశాడు. వారు వచ్చి చిన్నారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)