Breaking News

ఊయలే ఉరి తాడైంది

Published on Sat, 02/14/2026 - 04:50

వెల్దుర్తి: ఊయలే ఆ బాలుడికి ఉరి తాడైంది. ఏడేళ్లకే అందని లోకాలకు చేర్చింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కలుగొట్లలో గురువారం చోటు చేసు­కుంది. వివరాలివీ.. గ్రామానికి చెందిన అహ్మద్‌బాషా, హసీనాబీలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. చిన్న కుమారుడు అఫ్రోజ్‌(7) రెండో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజులుగా తట్టు వ్యాధితో బాధపడుతూ  ఇంట్లో ఉంటున్నాడు. 

గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన అఫ్రోజ్‌ ఇంటి ఆవరణలోని రేకుల షెడ్‌కు కట్టిన చీర ఊయలలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ చీర మెడకు బిగుసుకుంది. భోజనం ముగించుకుని బయటకు వచ్చిన తల్లిదండ్రులు కుమారుడి మెడకు ఊయల బిగుసుకుని కనిపించడంతో ఆందోళన చెందారు. చీరను తప్పించి చూడగా  మృతి చెందినట్లు గుర్తించారు. కళ్ల ముందు విగతజీవిగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)