Breaking News

మాట ఇచ్చారు.. వెంటనే ఆదుకున్నారు

Published on Thu, 08/31/2023 - 04:07

కాకినాడ సిటీ: కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. కుటుంబ పోషణ నిమిత్తం ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని విన్నవించగా.. 3 గంటల్లోనే ఆమె చేతికి ఉద్యోగ నియామక పత్రం అందించారు. వివరాలు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా తొత్తరమూడికి చెందిన గన్నవరపు ఝూన్సీరాణి కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త కూలి పనితో వచ్చే అంతంత మాత్రం ఆదాయమే ఆ కుటుంబానికి ఆధారం.

ఈ నేపథ్యంలో బుధ­వారం జగ్గంపేట మండలం ఇర్రిపాకకు వచ్చిన సీఎం జగన్‌ను ఝూన్సీరాణి కలిసింది. తన బాధను ముఖ్యమంత్రికి తెలియజేసింది. ఏదైనా ఉద్యో­గం ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ఆమె పరి­స్థితి తెలుసుకున్న సీఎం జగన్‌.. అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. తప్పకుండా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వెంటనే ఝాన్సీకి విద్యార్హతల ఆధా­­రంగా ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కాకి­నాడ కలెక్టర్‌ కృతికా శుక్లాను ఆదేశించారు. సీఎం జగన్‌ కార్యక్రమం ముగిసిన వెంటనే కలెక్టర్‌ కృతికా శుక్లా తన క్యాంపు కార్యాలయానికి ఝూన్సీరాణిని తీసుకెళ్లారు.

డిగ్రీ, డీఈడీతో పాటు పీజీ డిప్లామో ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌(పీజీడీసీఏ) చదివినట్లు తెలుసుకున్న కలెక్టర్‌.. వికాస సంస్థ సమన్వయంతో రూ.14 వేల ప్రారంభ వేతనంతో ఇంటి నుంచే పని చేసేలా కోజెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఉద్యోగం కల్పించారు. వెంటనే నియామక పత్రాన్ని అందించారు. అలాగే ఆమెకు ఉచిత వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సమన్వ­యకర్తను ఆదేశించారు. ఝాన్సీరాణి కుటు­ంబసభ్యులు స్పందిస్తూ.. అడిగిన వెంటనే స్పందించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)