Breaking News

రిజిస్ట్రేషన్‌ సేవలు ఇక సులభతరం  

Published on Sat, 04/22/2023 - 05:33

సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్లను సులభతరం చేసే ఇ–స్టాంపింగ్‌ సేవలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సురక్షితంగా రూపొందించిన ఇ–స్టాంపింగ్‌ విధానం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. www. shcilestamp. com  వెబ్‌సైట్, ఇ–స్టాంపింగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఇ–స్టాంపులను పొందవచ్చు. నగదు, చెక్కు, ఆన్‌లైన్‌ (నెఫ్ట్, ఆ ర్టీజీఎస్, పీఓఎస్, యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఎస్‌బీఐ, ఆప్కాబ్, యూనియన్‌ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచిలు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్‌ అమ్మకందార్లు, స్టాక్‌ హోల్డింగ్‌ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 పైగా కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో వెయ్యికిపైగా కేంద్రాల వద్ద త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 పైగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇ–స్టాంపింగ్‌ ద్వారా స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీలను చెల్లించవచ్చు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సెంట్రల్‌ రికార్డు నిర్వహించే ఏజెన్సీ స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సులభంగా సేవలందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో వినియోగదారులే స్వయంగా తమ డాక్యుమెంట్లను తయారు చేసుకుని ఇ–స్టాంపింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకునే అవకాశం ఉంటుంది.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ రామకృష్ణ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు డీఐజీ  శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)