Breaking News

కొండెక్కిన చికెన్‌! మంట పుట్టిస్తున్న మటన్‌..

Published on Tue, 05/21/2024 - 12:38

ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు. నిన్నా మొన్నటి వరకు రూ.200 పలికిన చికెన్‌ ధర ఇప్పుడు ఏకంగా 300 రూపాయలకు చేరుకోవటంతో సామాన్యులు హడలిపోతున్నారు. కోళ్ల దాణా ధరలు పెరగడంతోపాటు, వేసవి తీవ్రత నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో డిమాండ్‌ అధికమైందని, దీని వల్లే చికెన్‌ ధరలు భారీగా పెరిగాయని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దాణా ధర కేజీ 70 రూపాయలు పలుకుతుండటంతో కోళ్ల ఉత్పత్తిపై అనాసక్తి చూపుతున్నారు. పెరిగిన చికెన్‌ ధరతో తమకు నష్టమే జరిగిందని, విక్రయాలు తగ్గాయని దుకాణదారులు వాపోతున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగని కొందరు మాంసాహార ప్రియులు మాత్రం కేజీ చికెన్‌కు బదులు అర కేజీతో సర్దుకుంటున్నారు.

మటనా.. వొద్దుద్దులే..!
మాంసాహార ప్రియులకు మటన్‌ ధరలు కూడా మంట పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 700 రూపాయలు పలికిన మటన్‌ ధర ఇప్పుడు రూ.800 నుంచి రూ.900 పలుకుతుండటంతో కొనుగోలుదారులకే కాదు వ్యాపారులకు సైతం కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మండీ మార్కెట్‌ ఏజెంట్లు జీవాల రేట్లను విపరీతంగా పెంచేయటంతో మేకపోతులు, పొట్టేళ్లను అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని, అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పెరిగిన ధరలు త్వరలోనే తగ్గుముఖం పట్టాలని మాంసాహార ప్రియులు కోరుకుంటున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)