Breaking News

ప్రాంతానికో ప్రత్యేకం

Published on Sun, 01/14/2024 - 04:25

సాక్షి, అమరావతి: సంక్రాంతి సంబరాలను ఒక్కో ప్రాంత ప్రజలు ఒక్కో తరహాలో నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో కోడి పందేలు.. కోనసీమలో ప్రభల తీర్థం.. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు.. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు విన్యాసాలు.. కొన్నిచోట్ల పతంగులు ఎగురవేయడం వంటివి నిర్వహిస్తుంటారు. 

హోరాహోరీ తలపడే పందెం కోళ్లు
సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాల్లో కోడి పందేల జాతర మొదలవుతాయి. భోగి రోజున మొదలై çసంక్రాంతి, కనుమ వరకు మూడు రోజులపాటు ఊరువాడా పెద్దఎత్తున జరిగే కోడి పందేల్లో రూ.కోట్లు చేతులు మారతాయి. కోడి పందేల బరుల పక్కనే పేకాట, కోతాట, గుండాట వంటివి ఏర్పాటు చేయడంతో జూదాల జాతరను తలపిస్తాయి. ఏడాదిపాటు పహిల్వాన్‌ తరహాలో కోళ్లను మేపి.. వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన పందేల బరిలో దించుతారు. 

కోనసీమ ప్రభల తీర్థం
సంక్రాంతి వేళ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ప్రభల తీర్థం కనుల పండువగా జరుగుతుంది. కోనసీమలో 80 వరకు ప్రభల తీర్థాలు నిర్వహిస్తుండగా.. జగ్గన్న తోట ప్రభల తీర్థానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. గతేడాది దేశ రాజధానిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లోనూ ఇక్కడ ప్రభలను ప్రదర్శించారు.  

బండ్ల లాగుడు.. పరుగు పందెంలో ఎడ్లు 
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎడ్ల పందేలు, బండ లాగుడు పందేలను రైతులు ఉత్సాహంగా నిర్వహిస్తారు. వ్యవసాయంలో ఉపయోగించే ఎడ్ల జతకు బరువైన బండలు కట్టి నిర్దేశించిన ప్రాంతానికి ఏది ముందు చేరితే ఆ ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తారు. దీంతోపాటు పలు విభాగాల్లో ఎడ్లను పరిగెట్టించి ముందుగా గమ్యానికి చేరుకున్న వాటిని విజేతగా ప్రకటిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడా ఈ పందేలు జరుగుతాయి. అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లోను ఈ తరహా పోటీలు భోగి రోజున ప్రారంభించి మార్చి వరకు కొనసాగిస్తారు. 

‘జల్లికట్టు’తో పశువుల పండుగ
తమిళనాడులోని జల్లికట్టు మాదిరిగా చిత్తూరు జిల్లాలో పశువుల పండుగ ఉత్సాహంగా జరుపుకుంటారు. రంకెలేస్తూ పరుగులు తీసే కోడె గిత్తలను పట్టుకోవడానికి యువత ఉత్సాహంగా ఉరకలేస్తుంటారు. ఆ సంస్కృతి చిత్తూరు జిల్లాలోనూ ఎక్కువగా కన్పిస్తుంది. తమిళనాడులో కనుమ రోజున జల్లికట్టు నిర్వహిస్తే.. మన రాష్ట్రంలో సంక్రాంతి ముందు నుంచి పశు­వుల పండుగ జరపడం ఆనవాయితీగా వస్తోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)