Breaking News

రోడ్ల ‘రూల్‌’ మారిపోయింది

Published on Wed, 11/13/2024 - 04:20

సాక్షి, అమరావతి: రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఇకపై కూటమి నేతల అనుంగులకే దక్కనున్నాయి. ఇందుకు ప్రభుత్వ పెద్దలు పెద్ద ప్లానే వేశారు. తమ అస్మదీయ, బినామీ కాంట్రాక్టర్లకు అనుకూలంగా రోడ్ల నిర్మాణ కాంట్రాక్టు అర్హత నిబంధనలను సడలించారు. తమ వారు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా, ఇతర కాంట్రాక్టర్లు పోటీ పడకుండా అడ్డు­కుని మరీ కాంట్రాక్టులు ఏకపక్షంగా కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్‌ వేశారు. 

ఇందులో భాగంగా బిడ్లు దాఖలు చేసేందుకు అర్హతగా పరిగణించే కాల పరి­మితి (బ్లాక్‌పీరియడ్‌)ని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతూ ఆర్‌ అండ్‌ బి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు కోవిడ్‌ను కారణంగా చూపించడం గమనార్హం. ఇప్పటివరకు గత ఐదేళ్ల­లో కాంట్రాక్టు సంస్థలు చేసిన పనుల విలు­వను అర్హతగా పరిగణించేవారు. ఇక నుంచి గత పదేళ్లలో చేసిన నిర్మాణ పనులను పరిగణనలోకి తీసుకుంటారు. 

తద్వారా ప్రస్తుతం అర్హత లేని కాంట్రాక్టు సంస్థలు కూడా టెండర్లలో పాల్గొనేందుకు ప్రభుత్వ పెద్దలు మార్గం సుగమం చేశారు. ఈ పదేళ్ల బ్లాక్‌ పీరియడ్‌ సడలింపు 2026–27 వరకు వర్తిస్తుందని కూడా ప్రభు­త్వం ఉత్త­ర్వుల్లో పేర్కొ­ంది. అంటే రానున్న మూడేళ్లలో చేపట్టే రోడ్ల నిర్మాణ టెండర్లలోనూ వారి ఇష్టానుసారం కాంట్రాక్టులు కట్టబెడతారన్న విషయం స్పష్టమైంది.  

పీపీపీ రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే..! 
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై టోల్‌ భారం వేస్తూ పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో త్వ­రలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. మొత్తం రూ.4 వేల కోట్లతో రాష్ట్ర ప్రధాన, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి ఇప్పటికే నిర్ణయించింది. అందులో మొదటి దశగా రూ.698 కోట్లతో 3,931 కిలో­మీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి కన్సల్టెన్సీలను ఆహ్వా­­నించింది కూడా. 

ఈ కాంట్రాక్టులను ప్రభుత్వ పెద్దలు సన్నిహితులకు కట్టబెట్టేందుకే అర్హత నిబంధనలను సడలించినట్టు స్పష్టమవుతోంది. అందుకే కన్సల్టెన్సీల ఎంపిక కోసం ఉత్తర్వులు జారీ చేసిన మంగళవారమే కాంట్రాక్టు సంస్థల అర్హత నిబంధనలను కూడా సడలించింది. 

రోడ్ల నిర్మాణాన్ని అస్మదీయ సంస్థలకు ఏకపక్షంగా కట్టబెట్టి, ఆ సంస్థలు వాహనదారుల నుంచి ఐదేళ్ల పాటు టోల్‌ ఫీజుల రూపంలో భారీగా వసూలు చేసు­కునేందుకు ప్రభుత్వం పక్కాగా కథ నడుపుతోందని ఆర్‌ అండ్‌ బి వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)