సంప్రదాయానికే జై.. టోపీ, గౌన్లకు బై బై

Published on Sun, 12/22/2024 - 05:57

భారతీయ విద్యాసంస్థల స్నాతకోత్సవ సంప్రదాయాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. బ్రిటిష్‌ కాలం నాటి నల్లటోపీ, గౌన్ల స్థానాన్ని సంప్రదాయ చేనేత వస్త్రాలు భర్తీ చేస్తున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) 2015లో మేకిన్‌ ఇండియాలో భాగంగా ప్రధాని పిలుపు మేరకు విశ్వవిద్యాలయాల్లో సంప్రదాయ వస్త్రధారణకు మారాలని పిలుపునిచ్చింది. తద్వారా చేనేత పరిశ్రమ పునరుద్ధరణతో పాటు నేత కార్మికుల ఆదాయాన్ని పెంచేందుకు తోడ్పాటునివ్వాలని కోరింది. 

కేవలం భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించడమే కాకుండా వేడి, తేమతో కూడిన వాతావరణంలో చేనేత వస్త్రధారణ సౌకర్యవంతంగా ఉంటుందని భావించింది. ఈ క్రమంలోనే ఐఐటీలు, ఐఐఎంలు సహా దాదాపు 70 కేంద్ర విద్యాసంస్థలు యూజీసీ డ్రెస్‌ ఇండియన్‌ అడ్వైజరీ సిఫారసులను అమలు చేస్తామని ప్రకటించాయి. వీటిలో 62 విద్యాసంస్థలు ఇప్పటికే సంప్రదాయ దుస్తుల్లో స్నాతకోత్సవాలను నిర్వహిస్తున్నాయి. 

ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు కొనసాగిన శాటిన్‌ దుస్తులు, గౌన్లు, హుడ్స్, మోర్టార్‌బోర్డ్‌లు (టోపీలు) త్వరలో కనమరుగు కానున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మాత్రమే కాకుండా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల వైద్య సంస్థలను కూడా వారి స్నాతకోత్సవ వేడుకలకు భారతీయ దుస్తుల కోడ్‌ను అనుసరించాలని కోరడం విశేషం.     – సాక్షి, అమరావతి

కొన్ని వర్సిటీల్లో హైబ్రిడ్‌ డ్రెస్‌ కోడ్‌ 
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 48 సెంట్రల్‌ వర్సిటీలలో 34 సంస్థలు స్నాతకోత్సవాల్లో గౌన్లు, టోపీలను దశలవారీగా రద్దు చేశాయి. వీటిలో మహారాష్ట్రలోని వార్ధాలోని మహాత్మా గాంధీ అంతర్రాష్ట్ర హిందీ విశ్వవిద్యాలయ, పశ్చిమ బెంగాల్‌ శాంతినికేతన్‌లోని విశ్వభారతి, అస్సాంలోని తేజ్‌పూర్‌ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం యూజీసీ సిఫారసులకు ముందునుంచే సంప్రదాయ దుస్తులను అనుసరిస్తున్నాయి. 

ఢిల్లీ విశ్వవిద్యాలయం, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ జార్ఖండ్, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ కేరళ, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ తమిళనాడు ప్రత్యేకమైన డ్రెస్‌ కోడ్‌ లేకుండా భారతీయ, పాశ్చాత్య దుస్తులను మిళితం చేస్తూ హైబ్రిడ్‌ విధానాన్ని అనుసరిస్తుండటం గమనార్హం.  

బెనారస్‌ వర్సిటీ నుంచి మొదలై.. 
సెంట్రల్‌ వర్సిటీల్లో వారణాసిలోని బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ డ్రెస్‌ కోడ్‌ మార్పునకు మొదటగా స్పందించింది. ఇక్కడ స్నాతకోత్సవానికి విద్యార్థులు పసుపు రంగు ఉత్తరీయం, సఫాల(టోపీ)తో పాటు పురుషులైతే తెల్లటి కుర్తా–పైజామా, మహిళలు చీరలు ధరిస్తూ భారతీయ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా 11 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో డ్రెస్‌ కోడ్‌ మారలేదు. 

వీటిల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయం, మేఘాలయలోని నార్త్‌ ఈస్టర్న్‌ హిల్‌ విశ్వవిద్యాలయం, నాగాలాండ్‌ విశ్వవిద్యాలయం, మణిపూర్‌ విశ్వవిద్యాలయంలో త్వరలో మార్పుల కోసం ఆలోచిస్తున్నట్టు ధ్రువీకరించాయి. 

ఇప్పటికే నాగాలాండ్‌ విశ్వవిద్యాలయం తమ స్నాతకోత్సవ వేడుకలకు సంప్రదాయ నాగా దుస్తులను ప్రవేశపెట్టడంపై చర్చలు జరుపుతోంది. లద్ధాఖ్‌లోని సింధు సెంట్రల్‌ వర్సిటీ, సెంట్రల్‌ వర్సిటీ ఆఫ్‌ ఒడిశా, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ఏర్పడినవి కావడంతో ఇంకా స్నాతకోత్సవ వేడుకను నిర్వహించలేదు. 

వివాదాలూ ఉన్నాయ్‌! 
స్నాతకోత్సవాల్లో భారతీయ సంప్రదాయ దుస్తుల ధారణపై విమర్శలు లేకపోలేదు. విద్యావేత్తలు స్నాతకోత్సవం భావన పాశ్చాత్యమైనదని.. ఇందులో భారతీయ దుస్తుల కోడ్‌ ఎందుకని ప్రశి్నస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఐఐటీ–ఖరగ్‌పూర్‌ స్నాతకోత్సవంలో డ్రెస్‌ కోడ్‌ వివాదాన్ని రేకెత్తించింది. ఆ సంస్థ వస్త్రధారణ శైలిపై పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. 

పొడవాటి దుస్తులు, పాదరక్షలు, ఆభరణాలను కూడా ధరించాలని సూచించడంతో విద్యార్థులు మండిపడ్డారు. ఇప్పటికే భారతీయ తరహా దుస్తులు ధరిస్తున్నందున కొత్త మార్గదర్శకాలు ఏమిటని ప్రశి్నంచడంతో ఐఐటీ ఖరగ్‌పూర్‌ అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2021లో ఐఐటీ– జమ్మూ కాశీ్మరీలో ఫెరాన్లు (మోకాళ్ల వరకు ఉండే వస్త్రం), పకోల్స్‌ (పురుషుల టోపీ) స్ఫూర్తితో స్నాతకోత్సవ వేషధారణ కోసం ప్రణాళికలను ప్రకటించిన తర్వాత విమర్శలను ఎదుర్కొంది. 

ఆ తర్వాత  తెల్ల కుర్తాలు–పైజామాలకు మారింది. యూజీసీ సిఫారసు చేసిన డ్రెస్‌ కోడ్‌ను వ్యతిరేకిస్తూ లక్నోకు చెందిన బాబాసాహెబ్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలోని దళిత్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ 2019లో అంబేడ్కర్‌కు నివాళిగా పాశ్చాత్య దుస్తులు(సూట్‌) ధరించడానికి అనుమతి కోరింది. 

ఐఐటీ ఢిల్లీ మినహా.. 
కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్‌ వర్సిటీలు కలిపి 92 ఉన్నాయి. యూజీసీ సిఫారసులతో 76 శాతం కంటే ఎక్కువ వర్సిటీలు పాత డ్రెస్‌ కోడ్‌ను తొలగించాయి. మొత్తం 23 ఐఐటీల్లో ఒక్క ఐఐటీ–ఢిల్లీ తప్ప మిగతావన్నీ భారతీయ దుస్తులను స్వీకరించాయి. వీటిలో 18 ఐఐటీలు 2015 తర్వాత మార్పు చేశాయి. యూజీసీ సలహా కంటే ముందే భువనేశ్వర్, జోధ్‌పూర్, బాంబే, గాంధీనగర్, గౌహతి ఐఐటీలు భారతీయ దుస్తులను అనుసరిస్తుండటం విశేషం. 

ఐఐటీ భువనేశ్వర్‌లో మహిళలకు కుర్తా డ్రెస్‌ కోడ్‌కు బదులుగా చీరల ఎంపికను తీసుకొచి్చంది. ఐఐటీ బాంబేలో ఖాదీ ఉత్తరీయాన్ని ప్రవేశపెట్టారు. స్థానికతకు అద్దం పట్టేలా ఐఐటీ–మండిలో సంప్రదాయ నీలిరంగు శాటిన్‌ వస్త్రానికి బదులుగా ఇప్పుడు ఆఫ్‌–వైట్‌ కుర్తా–పైజామా, సల్వార్‌–కుర్తాలు (హిమాచలీ శాలువా, టోపీ)లతో జత చేసిన చీరలను ధరిస్తున్నారు. ఇక 21 ఐఐఎంలలో 14 సం­స్థ­లు పాత డ్రెస్‌ కోడ్‌ను రద్దు చేశాయి. 

కానీ, వీటిల్లో అన్నీ స్నాతకోత్సవ సంప్రదాయ వేషధారణను భారతీయ దుస్తులతో భర్తీ చేయలేదు. ఏడు ఐఐఎంలు స్టోల్‌తో కూడిన పాశ్చాత్య శైలి ఫార్మల్‌ దుస్తులను ఎంచు­కు­న్నారు. అయితే బెంగళూరు, కలకత్తా, లక్నో, ఇండోర్, రోహ్తక్, ఉదయ్‌పూర్, అమృత్‌సర్‌ ఐఐఎంలు ఇంకా పాత డ్రెస్‌ కోడ్‌నే కొనసాగిస్తున్నాయి. ఐఐఎం షిల్లాంగ్‌లో స్థానిక ఖాసీ ర్యాప్‌ దుస్తులను ఎంచుకున్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)