Breaking News

పంచాయతీ కార్యదర్శుల పేరు, కేడర్‌లో మార్పు

Published on Wed, 11/05/2025 - 05:28

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇకపై గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టు­ను గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (జీపీడీవో)గా ప్రభుత్వం మార్పు చేసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీసుకునే వేతనాల్లో ఎలాంటి మార్పులు లేకుండా, ప్రస్తుతం ఉన్న ఐదు కేడర్‌లను నాలుగు కేడర్‌లకు కుదించింది. జనాభా, వార్షికాదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరిస్తూ గత నెల 10వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన అంశాలతో పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ మంగళవారం జీవో జారీ చేశారు. తద్వారా ఇప్పటిదాక అమలులో ఉన్న 7,244 క్లస్టర్‌ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పని చేస్తాయి.

359 అర్బన్‌ పంచాయ­తీలు, 3,082 గ్రేడ్‌–1 పంచాయతీలు, 3,163 గ్రేడ్‌–2 పంచాయతీలు, 6,747 గ్రేడ్‌–3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలతో ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14,989 మంది పంచాయతీ కార్యదర్శుల్లో 1,487 మంది గ్రేడ్‌–1.. 993 మంది గ్రేడ్‌–2.. 2,235 మంది గ్రేడ్‌–3.. 4,108 మంది గ్రేడ్‌–4.. 6,166 మంది గ్రేడ్‌–5లో పని చేస్తున్నారు.

తాజా వర్గీకరణలో వీరిలో 359 మంది అర్బన్‌ పంచాయతీ కార్యదర్శులుగా, 3,082 మందిని గ్రేడ్‌–1.. 3,163 మందిని గ్రేడ్‌–2.. 6,747 మందిని గ్రేడ్‌–3.. 1,638 మందిని అడిషనల్‌ గ్రేడ్‌–3 పంచాయతీ కార్యదర్శులుగా కేడర్‌లో మార్పులు చేశారు.  359 అర్బన్‌ పంచాయతీల్లో ఉండే జీపీడీవో డిప్యూటీ ఎంపీడీవో స్థాయిలో కొనసాగ­డా­నికి సంబంధించి వేరుగా ఆదేశాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,097 మంది జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ బిల్‌ కలెక్టర్లుగా పని చేస్తుండగా.. అందులో 359 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ బిల్‌ కలెక్టర్‌ పోస్టులను సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. 

⇒ గ్రామ సచివాలయాల్లో పని చేసే మిగులు డిజిటల్‌ అసిస్టెంట్లు, ఇతర  సిబ్బందితో పంచాయతీ రికార్డులు, పరిపాలనా ప్రక్రియలను డిజిట­లైజ్‌ చేయడానికి, వర్క్‌ ఫ్లో ఆటోమేషన్, రియల్‌ టైమ్‌ పర్యవేక్షణ కోసం శాఖలో డెడికేటెడ్‌ ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.

⇒  గ్రామ పంచాయతీ జనరల్‌ ఫండ్స్‌ ద్వారా ఖర్చు భరించే స్థాయి ఉండే పంచాయతీల్లో ప్రత్యేక శానిటేషన్‌ విభాగం, నీటి సరఫరా విభాగం, కంట్రీ ప్లానింగ్‌ విభాగం, స్ట్రీట్‌ లైటింగ్‌–ఇంజనీరింగ్‌ విభాగంలో రెవెన్యూ విభాగం తరహా సిబ్బందిని అవుట్‌ సోర్సింగ్‌ లేదా కాంట్రాక్ట్‌ సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశం కల్పించారు.    

⇒ ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసే వారు కొత్తగా డీపీవో కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర క్యాడర్‌లో పని చేసేందుకు వీలుగా నిబంధనలు మార్పులు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొ­న్నారు. కాగా, ఆయా మార్పులు చేర్పులకు సంబంధించి వేర్వేరుగా అదనపు వివరాలతో ప్రభుత్వం మరికొన్ని జీవోలు జారీ చేయనుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)