Breaking News

తాళపత్ర గ్రంథ పరిష్కారానికి కేరాఫ్‌ చంద్రమౌళి

Published on Thu, 02/13/2025 - 05:43

అద్దంకి: తాళ పత్రాల గ్రంథాలను పరిష్కరించడంలో బాపట్ల జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన జ్యోతి చంద్రమౌళి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఈయన తాళపత్ర గ్రంథాలను పరిష్కరించడంలో కృష్ణా జిల్లాకు చెందిన తంగిరాల సుబ్బారావు తరువాత రాష్ట్రంలోనే రెండో వ్యక్తిగా నిలిచాడు. ఈయన వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసే సమయం నుంచి రిటైరైన తరువాత తాళపత్రాలను సేకరించి వాటిని శుభ్రం చేసి వాటికి పుస్తక రూపం ఇచ్చి భావితరాలకు అందేలా కృషి చేస్తున్నారు. 

ఆయన ఇప్పటికి పది తాళపత్రాల గ్రంథాలను పరిష్కరించి శుద్ధ ప్రతులను తయారు చేశారు. ఇప్పటికే ఒక గ్రంథం అచ్చయింది. మిగిలిన వాటికి  పుస్తకం రూపం ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం ప్రోత్సాహమో, లేక ఏదైనా సంఘాల చేయూత ఉంటేనే అవి అచ్చు అవుతాయి.  



ఇప్పటి వరకు పరిష్కరించిన తాళపత్ర గ్రంథాలు  
చంద్రమౌళి తన దగ్గరకు తెచ్చి ఇచ్చిన తాళపత్ర గ్రంథాల్లో ఇప్పటికి పోచయ్య బొంగరాలాట, కాటంరాజు కథ, వల్లురాజు కథ, ఆవుల మేపు, భట్టు రాయభారం, తరిగొండ వెంగమాంబ కథ, రాజయేగామృత సారం, గ్రామీణ వైద్యం అనే గ్రంథాలకు పుస్తకం రూపం ఇచ్చారు. పురాతన తాళపత్రాల గ్రంథాలను పరిష్కరించడం అంత తేలికైనపని కాదు. ఒక్కో ఆకు భద్రంగా బయటకు తీసి వాటికి రెండు రకాల రసాయనాలు పూస్తేనే అందులోని అక్షరాలు కనిపించి పరిష్కారానికి ఉపయోగిస్తాయి.   



తాళపత్ర పూర్వ చరిత్ర..  
జ్యోతి చంద్రమౌళి అందించిన వివరాల మేరకు ప్రస్తుతం, ఏదైనా రచన చేయాలన్నా ఉత్తరం రాయాలన్నా కాగితం అవసరం. అయితే అది ఇప్పటి మాట. ఒకప్పుడు కాగితాలు లేవు. అప్పుడు గ్రంథాలను రాయాలన్నా ఉత్తరాలు రాయాలన్నా తాళ (తాటి ఆకులు) పత్రాలను వాడేవారు. ప్రముఖంగా గ్రంథాలను రాయడానికి వీటిని ఎక్కువగా ఉపయేగించేవారు. అంతకు మునుపు తామ్ర పత్రాలు అంటే సన్నగా చేసిన రేకులపైన రాసేవారు. ఇవి 300 సంవత్సరాలకు పైగానే మన్నుతాయి.  

తాళపత్రాల సేకరణకు ప్రోత్సహించాలి
తాళపత్ర గ్రంథాలు ఇప్పటికే వేటపాలెం, రాజమండ్రి, కడప వంటి గ్రంథాలయాల్లో ఉన్నాయి. అయితే ఇంకా చాలా గ్రంథాలు తరతరాల నుంచి ఇళ్లల్లో ఉన్నాయి. ఆయా గ్రంథాలను బయటకు తీసి వాటికి పుస్తక రూపం ఇస్తే ఆయా గ్రంథాలు వెలుగు చూస్తాయి.   – విద్వాన్‌ జ్యోతి చంద్రమౌళి, రచయిత, శాస్త్ర పరిశోధకుడు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)