Breaking News

ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడమే లక్ష్యం

Published on Mon, 08/12/2024 - 05:15

సాక్షి, మచిలీపట్నం: బాధ్యతాయుతమైన, స్థిరమైన ఆక్వాకల్చర్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రం బృందం సభ్యులు తెలిపారు.  కృష్ణాజిల్లా మచిలీపట్నం శివారులోని గిలకలదిండిలో నిరి్మస్తున్న హార్బర్‌ను ఆదివారం కేంద్ర బృందం ప్రాజెక్టు ఇండియా సహాయ ప్రతినిధి డాక్టర్‌ కొండ చెవ్వ, బయో డైవర్సిటీ ఎక్స్‌పర్ట్, కో–ఆర్డినేటర్‌ సీమ భట్, లీడ్‌ టెక్నికల్‌ స్పెషలిస్ట్‌ మురళీధరన్, ఆక్వా కల్చర్‌ స్పెషలిస్ట్‌ విష్ణుభట్, ఫైనాన్స్‌ స్పెషలిస్టు నీలకంఠ మిశ్రా, ఎని్వరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ నీనా కోషి, సేఫ్‌ గార్డ్‌ స్పెషలిస్టు సలోమ్‌ ఏసుదాస్‌ పరిశీలించారు.

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ నేషన్‌ (ఎఫ్‌ఏఓ) ఆధ్వర్యంలో వాతావరణ పరిస్థితులు, మత్స్యకారుల ఇబ్బందులు, చేపల నిల్వ, ప్యాకింగ్, నీరు, ఉప్పు శాతం, భూమి, ఇతర నమూనాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన ఆక్వాకల్చర్‌పై దృష్టి పెడుతుందన్నారు. మెరుగైన, సైన్స్‌ ఆధారిత ఆక్వాకల్చర్‌ నిర్వహణ పద్ధతులు, ఇంటిగ్రేటెడ్‌ ల్యాండ్‌ స్కేప్‌ విధానాలు అవలంబించాలని, రసాయన వినియోగం తగ్గించి స్థిరమైన ఆక్వాను ఉత్పత్తి అయ్యేలా చూడాలన్నారు.

మన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగమతి చేస్తే.. రిజెక్టు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కేంద్ర బృందంతో భూగర్భ వనరులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భేటీ అయ్యారు. బందరును ఆక్వాహబ్‌గా మార్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోలార్‌ పవర్డ్‌ బోట్స్‌ సాంకేతికను వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అనంతరం కేంద్ర బృందం కలెక్టర్‌ డి.కె.బాలాజీని కలిసి, హార్బర్‌ వద్ద సేకరించిన అంశాలను ఆయనకు వివరించింది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)