Breaking News

కేంద్ర వైద్య, ఆరోగ్య బృందం పర్యటన

Published on Wed, 02/12/2025 - 04:34

ముంచంగిపుట్టు: ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర వైద్య, ఆరోగ్య బృందం ప్రతినిధులు అల్లూరి సీతా­రామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండల కేంద్రంలో మంగళవారం పర్యటించారు. స్థాని­క కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను తనిఖీ చేశా­­రు. మందుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. అనంతరం రక్త పరీక్షల గదికి వెళ్లి నెల వారీగా నమోదవుతున్న మలేరియా, టైఫాయిడ్‌ కేసుల వివరాలను వైద్యాధికారులు సంతోశ్, ధరణిల­ను అడిగి తెలుసుకున్నారు. 

కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడంలో జాప్యాన్ని గుర్తించి, ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూ­చించారు. వార్డుల్లో ఉన్న రోగులతో మాట్లా­డి, అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. గ్రామా­ల నుంచి ఆరోగ్య కేంద్రాలకు మధ్య దూరం, రవాణా సౌకర్యం, రోడ్ల పరిస్థితిని అడిగి తెలు­సుకున్నారు. అనంతరం సిక్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ)ను, పుట్టిన బిడ్డలు, బాలింతల ఆరోగ్య పరీక్షలు, అధికంగా నమోద­వుతున్న కేసులను పరిశీలించి పలు సూచ­నలు చేశారు. 

కర్రిముఖిపుట్టు, దార్రెల గ్రామా­ల్లో ఉన్న సబ్‌ సెంటర్లు, వెల్‌నెస్‌ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. గర్భిణు­ల­కు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టి­కాహారంపై ఆరా తీశారు. అనంతరం కిల­గాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించా­రు. రికార్డులు తనిఖీ చేశారు. రక్తహీనత కేసుల వివరాలను అడిగి తెలుసు­కున్నారు. వ్యాక్సి­నేషన్‌ తీరుపై ఆరా తీశారు. 

మందులను ఎప్ప­టి­కప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూ­చించి, నిల్వ లేని మందుల వివరాలు నమోదు చేసుకున్నారు. సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, సబ్‌సెంటర్ల నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా ఢిల్లీకి చెందిన కేంద్ర సచివాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌ సూచించారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి