Breaking News

జల వివాదాలపై కేంద్ర కమిటీ

Published on Sat, 01/03/2026 - 06:31

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌సింగ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారుడు, ఈఎన్‌సీ(ఇరిగేషన్‌), అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ ఉంటారు.

తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు, శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్‌సీ (జనరల్‌)తోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌లు, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సీఈలను సభ్యులుగా నియమించారు. సీడబ్ల్యూసీలో ప్రాజెక్టుల మదింపు విభాగం(పీఏవో) సీఈని కమిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన గతేడాది జూలై 16న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో కమిటీని నియమించి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

ఆ మేరకు ఇప్పుడు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి సమన్యాయంతో నీటి పంపకాల మార్గాలను సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం పేర్కొంది. జల వివాదాల పరిష్కారానికి మూడు నెలలులోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. ఇందుకోసం ఇతర విభాగాల అధికారులు, నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించింది.

పరిష్కారమయ్యేనా..?
కృష్ణా జలాలను ఉమ్మడి రాష్ట్రానికి బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు కల్పించింది. అయితే కృష్ణా నదీ జలాల పంపిణీపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడి అమలులోకి వచ్చే వరకు, బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో తమకు 50 శాతం నీటిని కేటాయించాలని తెలంగాణ సర్కార్‌ డిమాండ్‌ చేస్తోంది. గోదావరిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్‌పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులపై పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ వివాదాలపై చర్చించి పరిష్కారాలను సూచిస్తూ కేంద్రానికి కమిటీ ఇచ్చే నివేదికతోనైనా జల వివాదాలు పరిష్కారమవుతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)