Breaking News

‘ఉపాధి’లో రాష్ట్రాలకు చక్రబంధనాలు

Published on Thu, 04/24/2025 - 04:05

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణను మరింత పెంచింది. రాష్రాల్లో పథకం అమలులో దుర్వినియోగానికి తావులేకుండా పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా పథకం పనుల ప్లానింగ్, మంజూరులో సైతం మార్పులు తెచ్చింది. ఇందుకోసం ‘యుక్తధార’ పేరుతో ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఇస్రో – నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌తో అనుసంధానం చేసింది. తద్వారా ఈ పనులను తన నియంత్రణలోకి తీసుకుంటోంది. ఈ విధానం వల్ల ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు చాలా వరకు తగ్గిపోతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.  

చాలా కాలం నుంచి ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను కేంద్రమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇటీవల మెటీరియల్‌ కేటగిరీ (సిమెంట్‌ రోడ్లు లేదా ఇతర కూలీలను ఉపయోగించని) పనుల బిల్లులనూ నేరుగా కేంద్రమే ఆ వ్యక్తులకు, సంస్థలకు చెల్లిస్తోంది. ఇందులో రాష్ట్రాలు వాటి వాటా 25 శాతం నిధులను ఉమ్మడి ఖాతాకు జమ చేస్తేనే కేంద్రం 75 శాతం వాటా కలిపి బిల్లులు చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ పథకం పనుల ప్రణాళిక, అమలును కూడా కేంద్రమే ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది.

వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లో అమలు..
ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. ఏటా పంచాయతీల వారీగా ఉపాధి హామీ పథకం పనుల కల్పన, ప్రణాళికల రూపకల్పన ఆర్థిక సంవత్సరం ఆరంభానికి ముందే అక్టోబరు–ఫిబ్రవరి నెలల మధ్య రాష్ట్ర స్థాయిలో జరుగుతుండేది. ఈ ప్రణాళిక­లపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్చి నెలలో రాష్ట్రాలవారీగా సమావేశాలు నిర్వహించి వాటికి లేబర్‌ బడ్జెట్‌ పేరుతో ఆమోదం తెలిపేది. కొత్తగా గుర్తించిన పనులను గ్రామ పంచాయతీ లేదా మండల, జిల్లా పరిషత్‌లో తీర్మానం అనంతరం మంజూరు చేసేవారు. 

కేంద్రం తెచ్చిన కొత్త విధా­నం ప్రకారం ఇకపై ఆర్థిక సంవత్సరం మొత్తానికి కేంద్రం ఒకేసారి ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల వారీగా లేబర్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఏడాది మధ్యలో పనులు మంజూరు కావు. ఇలా ఏడాది ప్రణాళిక రూపకల్పనకు ‘యుక­్తధార’ మొబైల్‌ యాప్‌ ప్రవేశపెట్టింది. ఈ ఏప్రిల్‌ 1 నుంచి మండలానికి ఒక గ్రా­మ పంచాయతీ చొప్పున ఈ విధానం అమలు చేస్తుండగా, వచ్చే ఏడాది నుంచి అన్ని గ్రామాల్లో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పనుల గుర్తింపు కూడా సాంకేతికతోనే.. 
ఈ పథకంలో అవకతవకలకు సైతం వీలుండదని అధికారులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో చేపట్టడానికి అవకాశం లేని పనులను ప్రణాళికలో చేర్చే అవకాశం ‘యుక్తధార’ యాప్‌లో ఉండదని చెబుతున్నారు. యాప్‌ పూర్తిగా ఇస్రో ఆధ్వర్యంలో సమగ్ర గూగుల్‌ మ్యాప్‌నకు అనుసంధానమై ఉండటం వల్ల చెరువులు ఉన్న ప్రాంతంలోనే వాటి పూడిక తీత పనులు చేపట్టే వీలుంటుందని తెలిపారు. 

కొన్ని రకాల పనులకు ఆ ప్రాంత భూగర్భ పరిస్థితులు అనుకూలమా లేదా అన్నది కూడా పని నిర్ధారణ సమయంలోనే తెలిసిపోతుందని వివరించారు. తద్వారా పనుల గుర్తింపులో అక్రమాలకు తెరపడుతుందని చెబుతున్నారు.

దొంగ మస్టర్లకూ చెక్‌! 
ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్లకూ కేంద్రం చెక్‌ పెట్టబోతోంది. దీని ప్రకారం ఒక ప్రదేశంలో కూలీలు పనిచేసే సమయంలో రోజూ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఫొటో తీయాలి. ఆ ఫోటోలో ఉన్న కూలీల సంఖ్య, అక్కడ పనికి హాజరైనట్టు సిబ్బంది మస్టర్‌ షీట్‌లో నమోదు చేసే కూలీల సంఖ్య ఒక్కటిగా ఉంటేనే ఆ రోజు వేతనాల చెల్లింపు జరుగుతుంది. ఫోటోలో, మస్టర్‌ షీట్‌లో సంఖ్యలో  తేడా ఉంటే ఆ మస్టర్‌ షీటును పరిగణనలోకి కూడా తీసుకోరు.

ఇస్రో - నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌తో యాప్‌ అనుసంధానం
ప్రస్తుతం ఈ పథకం పనుల ప్రణాళిక ఆఫ్‌ లైన్‌ విధానంలో రూపొందించి, ఎంత మంది పేదలకు పనులు కల్పిస్తారో సంఖ్య మాత్రమే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఆ పనుల నంబర్లను పోర్టల్‌లో ఎంటర్‌ చేసి, వాటికి బిల్లులు పెడుతున్నారు. కొత్త విధానంలో మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రణాళిక పూర్తిగా ఆన్‌లైన్‌లో రూపొందుతుంది. ఏ పంచాయతీలో ఏ రకమైన పనిని ఏ ప్రదేశంలో చేపడతారో గూగుల్‌ మ్యాప్‌లో గుర్తించి, యాప్‌లో నమోదు చేస్తారు.

ఈ యాప్‌ పూర్తిగా ఇస్రో - నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇలా అన్ని పనులు జియో ట్యాగింగ్‌ చేసి, మ్యాప్‌లోనే ఒక్కో పనికి ఒక్కో నంబరును కేటాయిస్తారు. ప్రతి పనికి అంచనా విలువ సైతం యాప్‌లోనే నమోదు చేస్తారు. ఏ పనికి బిల్లులు పెట్టాలన్నా యాప్‌లో నమోదు చేసిన ప్రకారం వర్క్‌ ఐడీలను ఎంపిక చేసుకొని బిల్లులు పెట్టాలి.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)