Breaking News

మీరు వెళ్లాల్సిందే!

Published on Fri, 10/11/2024 - 03:27

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐఏఎస్‌ల కేడర్‌ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ రాష్ట్రానికి కేటాయించినవారు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని స్పష్టంచేసింది. తెలంగాణకు కేటాయించినా ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులు సృజన(ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌), శివశంకర్‌ లోతేటి (వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌), సీహెచ్‌ హరికిరణ్‌(వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌)లను వెంటనే తెలంగాణకు వెళ్లాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఆదేశాలు జారీ చేసింది. 

అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్‌ రోస్, ఆమ్రపాలి, వాణిప్రసాద్, ఐపీఎస్‌ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్‌ను వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశించింది. ఈ అధికారులను ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల నుంచి రిలీవ్‌ చేస్తూ వారికి కేటాయించిన రాష్ట్రాల్లో ఈ నెల 16వ తేదీలోగా రిపోర్ట్‌ చేయాల్సిందిగా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తెలియజేసింది. 

రాష్ట్ర విభజన సమయంలోనే... 
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమను తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థనలను తోసిపుచ్చింది. అలాగే తెలంగాణకు కేటాయించిన కొంతమంది ఐఏఎస్‌లు.. తమను ఏపీకి కేటాయించాలని కేంద్రాన్ని కోరినా అంగీకరించలేదు. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. వా­రికి అనుకూలంగా క్యాట్‌ తీర్పు ఇచ్చింది. క్యాట్‌ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. 

గత మార్చిలో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి వారి అభ్యర్థనలు మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవా­లని కేంద్రాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారుల అభ్యంతరాల పరిశీలనకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి దీపక్‌ను కేంద్రం నియమించింది. దీపక్‌ ఇచ్చిన నివేదిక మేరకు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల అభ్యర్థనలను తిరస్కరించింది. కచ్చితంగా కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)