Breaking News

ఆయిల్‌పామ్‌ రైతుల ఖుషీ

Published on Thu, 09/19/2024 - 06:02

సాక్షి, అమరావతి: ఆయిల్‌పామ్‌ ధరలు పతనమవుతున్న దశలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు ఊరటనిస్తోంది. మూడేళ్ల తర్వాత క్రూడ్‌ పామాయిల్‌ (సీపీవో)పై ఇకనుంచి 20 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో ఆయిల్‌పామ్‌ రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

దేశవ్యాప్తంగా సుమారు 45 శాతం మంది పామాయిల్‌నే వంటనూనెగా వినియోగిస్తుండగా.. మన దేశంలో ఉత్పత్తి అయ్యేది స్వల్పమే. దేశీయ అవసరాలు తీర్చేందుకు నెలకు సుమారు 6,84,000 టన్నుల పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. 

2022కు ముందు క్రూడ్‌ పామాయిల్‌పై 49 శాతం దిగుమతి సుంకం ఉండేది. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయడంతో ధరలు పడిపోయాయి. దీంతో ఆయిల్‌పామ్‌ తోటలను సాగు చేసే రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చి0ది.  

సాగు, దిగుబడుల్లో నంబర్‌ వన్‌గా ఎదిగిన ఏపీ 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గడచిన ఐదేళ్లలో ఆయిల్‌పామ్‌ సాగు, దిగుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానం సాధించి దేశంలోనే నంబర్‌ వన్‌గా ఎదిగింది. క్రమం తప్పకుండా ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియో(ఓఈఆర్‌)ను ప్రకటించడంతో ఓ దశలో ఫ్రెష్‌ ఫ్రూట్‌ బెంచ్‌ (ఎఫ్‌ఎఫ్‌బీ)కు టన్ను రూ.24 వేల వరకు పొందిన ఆయిల్‌పామ్‌ రైతులు.. 2022లో దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సాగుదారులు ఒక్కసారిగా కుదేలయ్యారు. 

ఈ నేపథ్యంలో పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా ఉప ఉత్పత్తుల (గింజల) విలువను చేరుస్తూ వయబిలిటీ ధరను సవరిస్తూ రైతుకు లాభదాయకమైన ధరను ప్రకటించాలని, దిగుమతి సుంకాన్ని తక్షణమే పునరుద్ధరించాలంటూ ఆయిల్‌పామ్‌ రైతులు ఉద్యమబాట పట్టారు. వీరికి బాసటగా నిలిచిన వైఎస్‌ జగన్‌ పలుమార్లు లేఖలు రాయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 

ఇటీవల రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను జాతీయ ఆయిల్‌పామ్‌ రైతుల సంఘ ప్రతినిధులు కలిసి కేంద్రం ఆదుకోకపోతే ఆయిల్‌పామ్‌ సాగుదారులు సంక్షోభంలో కూరుకుపోతారనే విషయాన్ని వివరించారు. గతంలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన కృషి, ఆయిల్‌పామ్‌ రైతులు ఆందోళన ఫలించడంతో ఎట్టకేలకు సీపీవోపై దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

టన్ను రూ.13,950 పలుకుతున్న ఆయిల్‌పామ్‌ గెలల ధర కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో టన్ను రూ.16 వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.  

కనీసం రూ.20 వేలు ఉండాల్సిందే 
పెరిగిన ఎరువుల ధరలు, పెట్టుబడి ఖర్చుల నేపథ్యంలో టన్నుకు రూ.20 వేలు వస్తే కానీ ఆయిల్‌పామ్‌ రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి. దిగుమతి సుంకం పునరుద్ధరించిన కేంద్రం వయబిలిటీ ధరను కూడా సవరించి, డైనమిక్‌ డ్యూటీ మెకానిజం ఏర్పాటు చేయాలి. దిగుమతి సుంకాన్ని పునరుద్దరించిన కేంద్రానికి రుణపడి ఉంటాం. – బొబ్బ వీరరాఘవరావు, అధ్యక్షుడు, ఏపీ ఆయిల్‌పామ్‌­ రైతుల సంక్షేమ సంఘం

ఆయిల్‌పామ్‌ రైతులకు ఊరట 
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సంక్షోభంలో ఉన్న ఆయిల్‌పామ్‌ రైతులకు ఎంతో ఊరటనిస్తుంది. రైతు అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించి దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించేందుకు సహకరించిన కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఆయిల్‌పామ్‌ రైతుల తరఫున కృతజ్ఞతలు. క్రూడ్‌ పామాయిల్‌పై దిగుమతి సుంకం విధించడం వల్ల దేశీయంగా ఆయిల్‌పామ్‌ సాగు మరింత విస్తరించేందుకు దోహద పడుతుంది. – కె.క్రాంతికుమార్, ప్రధాన కార్యదర్శి, జాతీయ ఆయిల్‌పామ్‌ రైతుల సంఘం 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)