Breaking News

ర్యాగింగ్‌ నంబరు 165 @ 2024

Published on Mon, 06/16/2025 - 04:35

సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా వైద్యకళాశాలల్లో గతేడాది నమోదైన ర్యాగింగ్‌ ఫిర్యాదుల గణాంకాలను కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదించింది. దేశ వ్యాప్తంగా 2024లో మొత్తం 165 కేసులు నమోదైనట్లు  వెల్లడించింది, ఈ నివేదిక ప్రకారం అత్యధిక ఫిర్యాదులు నమోదైన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ మొదటిస్థానంలో నిలవగా, రెండోస్థానంలో బిహార్‌ ఉంది. ఉత్తర ప్రదేశ్‌లో 33, బిహార్లో 17 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది.

 ఏపీతో పాటు హరియాణా, ఉత్తరాఖండ్‌లో గతేడాదిలో చెరో ఆరు ర్యాగింగ్‌ ఘటనలు  చోటు చేసుకున్నాయని నివేదిక వెల్లడించింది. తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌లో చెరో మూడు కేసులు నమోదై 12వ స్థానంలో నిలిచాయి. ర్యాగింగ్‌ నివారణలో కేరళ ఆదర్శనీయంగా నిలిచింది. కేవలం ఒకే ఒక్క ఫిర్యాదుకు మాత్రమే పరిమితమైందని కేంద్రం తెలిపింది.  

కళాశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లు సహా క్యాంపస్‌లోని పలు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు సంస్థలలోని వివిధ ప్రదేశాల్లో ర్యాగింగ్‌ నిరోధక పోస్టర్లు హోర్డింగ్‌లను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. ర్యాగింగ్‌పై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్‌ ప్రత్యేక పోర్టల్‌ని ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది.  

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)