Breaking News

కవిత్రయం తరువాత సిసలైన కవి జాషువా

Published on Wed, 09/27/2023 - 03:52

ఏఎన్‌యూ: కవిత్రయం తరువాత తెలుగులో సిసలైన కవి గుర్రం జాషువా అని అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యూనివర్సిటీ తెలుగు విభాగం, ఏపీ అధికార భాషా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి ముందస్తు వేడుకలు మంగళవారం జరిగాయి.

ముఖ్య అతిథిగా హాజరైన విజయబాబు మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న ఛీత్కారాలను సత్కారాలుగా మలచుకున్న దార్శనికుడు జాషువా అని చెప్పారు. వీసీ పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ.. జాషువా విశ్వజననీయమైన రచనలు చేశారన్నారు. జాషువా తన సాహిత్యం ద్వారా విశ్వాన్ని జాగృతం చేశారన్నారు. రెక్టార్‌ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ బి.కరుణ, పాలక మండలి సభ్యురాలు సీహెచ్‌.స్వరూపరాణి, సీడీసీ డీన్‌ కె.మధుబాబు, ప్రిన్సిపాల్స్‌ పి.సిద్దయ్య, శ్రీనివాసరెడ్డి, ప్రమీలారాణి ప్రసంగించారు.  

సాహితీ పురస్కారాలు ప్రదానం
తెలుగు భాషా సాహిత్యంలో విశేష సేవలు అందించిన దుగ్గినపల్లి ఎజ్రయ్య, కొమ్మవరపు విల్సన్‌రావు, విడదల సాంబశివరావు, పోగుల విజయశ్రీ, కొండపల్లి సుదర్శనరాజు, గుమ్మ సాంబశివరావు, కాకాని సుధాకర్, సీహెచ్‌ స్వరూపరాణి, గుమ్మడి విజయ్‌కుమార్, డి.అనిల్‌కుమార్, పీవీ సుబ్బారావుకు సాహితీ పురస్కారాలు ప్రదానం చేశారు. వ్యాసరచన, వక్తృత్వం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)