amp pages | Sakshi

కుల గణనపై సీఎం జగన్‌ సంకల్పానికి సలాం 

Published on Thu, 11/23/2023 - 05:49

సాక్షి, అమరావతి: ‘కుల గణన’ ఒక చరిత్రాత్మక కార్యక్రమమని, ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఎంతో ధైర్యంగా చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పానికి ఎవరైనా సలాం చెప్పక తప్పదని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పేదవర్గాలకు  మేలు కలిగించడంలో కులగణన కీలకమని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఇది ఆదర్శవంతమైన కార్యక్రమమని అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాల్లోనూ కులాల లెక్కలు తీసేందుకు సాహసం చేయలేదన్నారు. ప్రధాని మోదీ బీసీ వర్గానికే చెందినా బీసీ లెక్కలు తీయించే ఆలోచన చేయలేదని అన్నారు. ఆ ధైర్యం ఒక్క సీఎం జగన్కే ఉందన్నారు.

కులాల లెక్కలు తీసి, బలహీన వర్గాలకు విద్య, వైద్యంతో పాటు అన్ని రకాలుగా మెరుగైన సంక్షేమం అందించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు దక్కేందుకు సీఎం జగన్‌  బాటలు వేస్తున్నారు. 100 ఏళ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్న కులగణన బీసీలకే కాకుండా మిగతా కులాల వారికీ మేలు చేస్తుందని తెలిపారు. అందుకే రాష్ట్రంలోని బీసీ సంఘాలు, ఇతర ఉప కుల సంఘాల వారంతా సీఎం జగన్‌ ఔన్నత్యాన్ని కొనియాడుతున్నారని, ఆయనకు  కృతజ్ఞతలు చెబుతున్నారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగనే బలం, బలగం అని తెలిపారు.

 అందుకే రాష్ట్రవ్యాప్తంగా అందరూ సీఎం జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. కుల గణన గిట్టని కొందరు విపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ నేతల మాయమాటల్ని, అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. బీసీల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ.. మంత్రివర్గంలో ఆ వర్గాలకు  బొటా»ొటీ పదవులిచ్చేదన్నారు. చంద్రబాబు హయాంలో రాజ్యసభ సభ్యుల్లో అసలు బీసీలే లేరని చెప్పారు. జడ్జిలుగా బీసీలు పనికి రారని కేంద్రానికి లేఖ రాసిన ఘనుడు చంద్రబాబని అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారుల తోలు తీస్తానని అహంకారంతో హుంకరించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. 

సామాజిక సాధికార యాత్రలకు విశేష స్పందన 
పేద కుటుంబాలు సొంత ఇంట్లో ఉండాలని సీఎం జగన్‌ 32 లక్షల ఇళ్ళ స్థలాలు ఇస్తే, అందులో మెజార్టీ బీసీలకే వచ్చాయని తెలిపారు. పదవులు, ఉద్యోగాల్లో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకే ఇచ్చారని చెప్పారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలివ్వగా, అందులో 80శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారేనన్నారు.

బీసీలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్, 139 బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. అందుకే సీఎం జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల పక్షపాతి అని స్పష్టంగా చెప్పగలుగుతున్నామని తెలిపారు. అందువల్లే సీఎం జగన్‌ ఈ వర్గాలకు చేసిన మేలును వివరిస్తూ చేస్తున్న సామాజిక సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని వివరించారు.  

Videos

బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ

రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్

ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక

జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి

సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు

"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..

చరిత్ర సృష్టించిన హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ..

దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..

అమెరికా పారిపోయిన అయ్యా.. కొడుకులు

ఏపీలో అల్లర్లు చేసింది వీరే..

Photos

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)