Breaking News

కేసుల విచారణ బాధ్యతాయుతంగా ఉండాలి

Published on Sun, 01/19/2025 - 05:01

విశాఖ లీగల్‌: దిగువ న్యాయస్థానాల్లో కేసుల విచారణ బాధ్యతాయుతంగా ఉండాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ పేర్కొ­న్నా­రు. విశాఖ ఏయూ కాన్వొకేషన్‌ కేంద్రంలో శనివారం జాతీయ, ఏపీ జ్యుడీషి­య­ల్‌ అకాడమీ ఆధ్వ­ర్యంలో దక్షిణ మండల–2 న్యాయ­మూర్తులకు ‘న్యాయ­స్థానా­ల్లో వ్యాజ్యాల జాబితా అన్వే­షణ, మినహాయింపు’ అ­నే అంశంపై నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆ­య­న పాల్గొన్నారు.

కేసుల విచారణలో మానవత్వం, మానవ హ­క్కు­లు, మధ్యవర్తిత్వం, ప్రత్యామ్నాయ మా­ర్గా­లు పాటించాలని, ఈ విధానాల వల్ల  కక్షిదారు­నికి అన్యాయం జరగకుండా  తీర్పులొస్తాయన్నారు.  ఎన్ని తీర్పులిచ్చాం అనే దానికంటే తీర్పుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం ముఖ్యమన్నారు. దిగువ కోర్టుల్లో విప్లవాత్మక మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే పూర్తి కంప్యూటర్‌ ఫైలింగ్, కృత్రిమ మేధస్సు సేవలు, కాగిత రహిత మార్పులు వంటివి అమల్లోకి వస్తాయన్నారు. 

దేశవ్యాప్తంగా 38 లక్షల కేసుల నమోదు
జాతీయ జ్యుడీషియల్‌ అకాడమీ చైర్మన్‌ జస్టిస్‌ అని­రుధ్‌ బోస్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఏటా సగటు­న 38 లక్షల కేసులు నమోదవుతున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 4.5 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. ఇలాంటి కేసుల విషయంలో మధ్యంతర ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయడం మంచిదన్నారు. జాతీయ జ్యుడీషి­యల్‌ అకాడమీ డైరెక్టర్‌ జస్టిస్‌ పీఎస్‌ నరసింహ మా­ట్లా­డుతూ.. అవసరం లేని సుదీర్ఘ వాదనలు, సంబంధం లేని సాక్ష్యాలు, కాలయాపన చేయడానికి జరుగు­తున్న వివిధ 
రకాల పిటిషన్లు న్యాయవ్యవస్థను  ఒత్తిడికి గురిచేస్తున్నాయన్నారు.

వీటినుంచి బయట­పడి సాంకేతికతో కూడిన విధానాలను పాటించాలని సూచించారు. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.నరేంద్ర, జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయ­మూర్తి జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు మాట్లాడారు. సదస్సులో ఐదు రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, గుత్తుల గోపి,   ఎం.వెంకటరమణ తదితరులు న్యాయమూర్తులను సత్కరించారు.

#

Tags : 1

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)