Breaking News

రూ.280 కోట్లతో ‘కార్గిల్‌’ వంటనూనెల శుద్ధి కర్మాగారం

Published on Thu, 02/09/2023 - 04:02

సాక్షి, అమరావతి: ప్రముఖ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ కార్గిల్‌ ఇండియా తమ దక్షిణ భారతదేశ వ్యాపార విస్తరణకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.280 కోట్లతో నెల్లూరు జిల్లా కృష్ణపట్న­ం వద్ద  ప్రపంచస్థాయి ప్రమాణాలతో వివిధ వంట నూనెల తయారీ కేంద్రాన్ని కొనుగోలు చేసి ఆధునీకరించినట్లు తెలిపింది. బుధవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘జెమిని ప్యూరిట్‌’ బ్రాండ్‌ పేరుతో సన్‌ఫ్లవర్‌ రిఫైండ్‌ ఆయిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ సందర్భంగా కార్గిల్‌ ఇండియా ఇన్‌గ్రిడియంట్స్‌ (దక్షిణాసియా) కన్జూమర్‌ బిజినెస్‌ లీడర్‌ అవినాష్‌ త్రిపాఠి మాట్లాడుతూ దేశవ్యాప్త సన్‌ఫ్లవర్‌ వినియోగంలో 70 శాతం దక్షిణ భారతదేశంలోనే జరుగుతోందని, దీంతో దక్షిణ దేశ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ‘జెమిని ప్యూరిట్‌’ని విజయవాడలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణపట్నం వద్ద సన్‌ఫ్లవర్, రిఫైండ్‌ పామాయిల్, పామోలిన్, వనస్పతి, బేకరీ షార్టెనింగ్స్‌ను తయారు చేసి అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం దేశంలోనే అతిపెద్ద 4.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)