Breaking News

జాతీయ స్థాయిని మించి ఏపీ తలసరి వినియోగ వ్యయం 

Published on Mon, 02/26/2024 - 05:39

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే 2022–23 వెల్లడించింది.

వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత ఆహార, ఇతర వస్తువులతోపాటు ఆహారేతర వస్తువుల వినియోగం ఆధారంగా 2022–23 గృహ వినియోగ వ్యయ సర్వే కోసం క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించినట్టు సర్వే నివేదిక వె­ల్లడించింది.

ఆహార పదార్థాలైన బియ్యం, గోధుమ­లు, మొక్కజొన్న రాగులు, పప్పులు, చక్కెర, వంట నూనెలు, ఆహారేతర వస్తువులైన ల్యాప్‌టాప్, పీసీ, టాబ్లెట్, మొబైల్, సైకిల్, మోటార్‌ సైకిల్, స్కూ­టీ, స్కూల్‌ యూనిఫాం, స్కూల్‌ షూ తదితర వస్తువులను పరిగణనలోకి తీసుకుని నెలవారీ తల­సరి వినియోగ వ్యయాన్ని లెక్కించినట్టు సర్వే నివేదిక తెలిపింది. 

రాష్ట్రంలో తలసరి వ్యయం ఇలా.. 
జాతీయ స్థాయిలో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.3,860 ఉండగా.. పట్టణాల్లో ఆ వ్యయం రూ.6,521 ఉన్నట్టు సర్వే పేర్కొంది. ఏపీ విషయానికి వస్తే గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,996 ఉండగా.. పట్టణాల్లో రూ.6,877 ఉన్నట్టు సర్వే వెల్లడించింది. పొరుగు రాష్ట్రం తెలంగాణ గ్రామా­ల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉంది. తెలంగాణలో తలసరి వినియోగ వ్యయం రూ.4,959గా ఉంది.

అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.2,257 రూపాయలు ఉండగా.. పట్టణాల్లో రూ.4,557 ఉందని సర్వే తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చూస్తే ఛండీగఢ్‌లో గ్రామాల్లో అత్యధికంగా నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.7,467 ఉండగా.. పట్టణాల్లో రూ.12,577 ఉంది. అత్య­ల్పంగా లడ్హాక్‌లో గ్రామాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.4,062 ఉండగా.. పట్టణాల్లో రూ.5,511 ఉందని సర్వే నివేదిక తెలిపింది.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)