Breaking News

‘టెట్‌’కు అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రాలే 

Published on Mon, 02/26/2024 - 05:16

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)–2024కు పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కేటాయిస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆదివారం ‘ఈనాడు’ పత్రికలో ‘టెట్‌ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్ష’ పేరిట ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తమని కమిషనరేట్‌ ఓ ప్రకటనలో ఖండించింది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఎంపికలో ఆరు కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలన్నారు. అలా మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో 82 శాతం మందికి మొదటి ప్రాధాన్య  కేంద్రాన్నే కేటాయించినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ పేర్కొన్నారు.   

కేటాయింపు ఇలా.. 
మ్యాథ్స్, సైన్స్‌ విభాగంలో దరఖాస్తు చేసుకున్న 58,631 మందిలో 90.97 శాతం మందికి మొ­దటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవ­లం 37 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. మరో 3,389 మందికి (5.78 శాతం) రెండో ప్రాధాన్య కేంద్రాన్ని, 1,406  మందికి మూడో ప్రాధాన్య కేంద్రాన్ని, 373  మందికి నాలుగో ప్రాధాన్య కేంద్రాన్ని, 93 మందికి ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు విద్యా శాఖ కమిషనర్‌ వివరించారు. 

► సోషల్‌ విభాగంలో 36,776 మందిలో 31051 మంది (84.43శాతం)కి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం ముగ్గురికి మాత్రమే ఆరో కేంద్రాన్ని కేటాయించారన్నారు.  
► తెలుగు విభాగంలో వచ్చిన దరఖాస్తుల్లో 149 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, మిగిలిన వారికి మొదటి కేంద్రాన్నే ఇచ్చామన్నారు. 

► ఇంగ్లిష్‌ విభాగంలో 17 మందికి మాత్రమే ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. ఈ విభాగంలో ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని ఎవరికీ ఇవ్వలేదన్నారు.  
► హిందీ విభాగంలో 8,752 మందికి (80.43 శాతం) మొదటి ప్రాధాన్య కేంద్రం, మరో ఇద్దరికి ఆరో ప్రాధాన్య కేంద్రం ఇచి్చనట్టు పేర్కొన్నా­రు. ఉర్దూ విభాగంలో అందరికీ మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు తెలిపారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)