Breaking News

విద్యుత్‌ ఉద్యోగుల మెడపై కత్తి

Published on Wed, 10/08/2025 - 05:31

సాక్షి, అమరావతి: విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించకపోగా వారి మెడపై కత్తులు వేలాడదీస్తోంది కూటమి ప్రభుత్వం. తమ డిమాండ్ల సాధన కోసం గత నెల నుంచి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తోంది. విద్యుత్‌ ఉద్యోగులను చర్చలకు పిలుస్తూనే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా ఉద్యోగులకు సెలవులను రద్దుచేసింది. ఇప్పటికే సెలవులో ఉన్నవారంతా తక్షణమే విధుల్లో చేరాలని హుకుం జారీచేసింది. అత్యవసరమైతే.. ఉన్నతాధికారుల అనుమతిపత్రం తీసుకోవాలని, లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

బెదిరిస్తే నిరవధిక సమ్మె.. 
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇవ్వాల్సిన నాలుగు డీఏ బకాయిలను విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని, ఐఆర్‌ ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని, ఎనర్జీ అసిస్టెంట్లను జూనియర్‌ లైన్‌మెన్లుగా గుర్తించాలని, పింఛన్‌ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) కొంతకాలం కిందట ఆందోళనకు శ్రీకారం చుట్టింది. 

పలు దఫాలుగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఈ నెల 15 వరకు గడువు ఇచ్చి, అప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని నోటీసు ఇచ్చింది. దీంతో బుధవారం (నేడు) విజయవాడలోని విద్యుత్‌ భవన్‌లో చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే అంతకుముందే ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చేపట్టింది. జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ఉద్యోగులంతా సెలవులను రద్దుచేసుకుని విధులకు హాజరుకావాలంటూ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఆదేశాలు జారీచేశారు. 

మెడికల్‌ ఎమర్జెన్సీ వస్తే తప్ప ఎవరికీ సెలవులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఎవరైనా హెడ్‌క్వార్టర్‌ దాటి వెళ్లాలంటే ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. కార్పొరేట్‌ కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాల్లో పనిచేసే శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిందేనని తెలిపారు. 

ఇందుకోసం ప్రత్యేక నమూనా హాజరుపట్టీలో వారి హాజరు నమోదుచేసి రోజూ సీఎండీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. దీనిపై ఉద్యోగసంఘాలు మండిపడుతున్నాయి. తమను బెదిరించి ఆందోళనలను విరమింపజేయాలని ప్రయత్నిస్తే వెంటనే నిరవధిక సమ్మెలోకి వెళతామని జేఏసీ హెచ్చరించింది.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)