Breaking News

వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్ రద్దు

Published on Thu, 08/31/2023 - 21:22

విజయవాడ: వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్శిటీ పీజీ మెడికల్‌ సీట్ల కౌన్సిలింగ్‌ రద్దయ్యింది. మెడికల్‌ కళాశాలల సీట్ల భర్తీలో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు అవతవకలు పాల్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన (నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌) ఎన్‌ఎంసీ.. కౌన్సిలింగ్‌ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్‌ఎంసీ నుంచి సీట్ల పెంపుదలపై ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు నకిలీ ఆదేశాలు వచ్చాయి.  ఈ అవతవకల విషయం వెలుగులోకి రావడంతో తిరిగి కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభించాలని వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్శిటీకి ఆదేశాలు జారీ చేసింది ఎన్‌ఎంసీ. 

నంద్యాల శాంతి రామ్ మెడికల్ కాలేజీలో 7 ఎండి జనరల్ మెడిసిన్ సీట్లకు బదులుగా, 24 సీట్లను భర్తీ చేశారని గుర్తించిన ఎన్‌ఎంసీ.. రాజమహేంద్రవరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ లో 24 సీట్లుండగా 40 జనరల్ మెడిసిన్ సీట్లను భర్తి చేసినట్లు పసిగట్టింది. విజయనగరం మహారాజా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎక్కువ సీట్లు భర్తీ చేసినట్లు గుర్తించారు. 

ప్రైవేట్ మెడికల్ కళాశాలలకి ఎన్‌ఎంసీ పేరుతో ఫేక్ ఆర్డర్స్ వచ్చినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో కొందరి ఉద్యోగుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇంటి దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమైంది ఎన్‌ఎంసీ. మూడు మెడికల్ కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ రద్దు కావడంతో విద్యార్ధులు ఇబ్బంధి పడకుండా యూనివర్సిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)