Breaking News

బ్యాంక్‌ దోపిడీకి స్కెచ్‌

Published on Fri, 12/19/2025 - 04:44

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి రింగ్‌ రోడ్డులోని కెనరా బ్యాంక్‌లో దోపిడీకి ఏడుగురు ఆగంతకులు స్కెచ్‌ వేశారు. బ్యాంక్‌ను దోచుకోవడానికి పట్టపగలు తుపాకులతో చొరబడ్డారు. బ్యాంక్‌ సిబ్బంది అప్రమత్తమై అలారం ఆన్‌ చేయడంతో భయపడి దుండగులు పరారయ్యారు. వివరాలు.. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనకాపల్లి రింగ్‌ రోడ్డులోని కెనరా బ్యాంక్‌కు ఏడుగురు వచ్చారు. అప్పటికే కొంత మంది ఖాతాదారులు బ్యాంకులో ఉన్నారు. వచ్చిన ఏడుగురిలో ఇద్దరు గేటు వద్ద వేచి ఉండగా.. ఐదుగురు లోపలకు ప్రవేశించారు.

కొంత సేపు వారు లోపల అన్ని విభాగాలను పరిశీలించారు. వీరిలో ఒకరు బ్యాంక్‌ మేనేజర్‌ దగ్గరకు, మరో వ్యక్తి క్యాష్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లి తుపాకులు తీసి బెదిరించారు. ఈ పరిణామంతో బ్యాంకులోని ఖాతాదారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది తేరుకుని సైరన్‌ మోగించారు. దీంతో  దొంగలు వెంట తీసుకొచి్చన ద్విచక్ర వాహనాలపై రైల్వే స్టేషన్‌ మీదుగా పారిపోయారు. బ్యాంక్‌ అధికారులు అనకాపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకు చేరుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)