Breaking News

జల్లికట్టు.. గిత్తను పట్టు

Published on Wed, 01/17/2024 - 05:26

చంద్రగిరి/గుడివాడ టౌన్‌: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం కనుమ పండుగను ప్రజలు ఆనందోత్సాహల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు సందడిగా సాగాయి. జల్లికట్టులో దిగి.. కోడెగిత్తల మెడల వంచి.. వాటికి కట్టిన పలకల్సి సొంతం చేసుకునేందుకు యువకులు ఉత్సాహం చూపారు. చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో మంగళవారం నిర్వహించిన జల్లికట్టును వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి, రాష్ట్రే తర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున విచ్చేశారు. వీధులన్నీ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి.

మహిళలు మేడలు, మిద్దెలు ఎక్కి ఆసక్తికరంగా జల్లికట్టును వీక్షించారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. పశువుల యజమానులు వాటికి వెండి దేవతామూర్తుల విగ్రహాలను కట్టి బరిలోకి దింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడక్కడా చెదురుమదురు గొడవలు తప్ప, ఆద్యంతం ఎడ్ల పందేలు ప్రశాంతంగా ముగిశాయి. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యరి్థ, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి గ్రామ దేవతకు పూజలను నిర్వహించి జల్లికట్టును వీక్షించారు.  

ముగిసిన బండలాగుడు పోటీలు 
కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన ఎడ్ల పోటీలు విజయవంతంగా ముగిశాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని) ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొన్న జతలకు తొమ్మిది విభాగాలలో బహుమతులు అందజేశారు. రూ.లక్ష నుంచి రూ.5 వేల వరకు నగదు బహుమతులు అందించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)