Breaking News

ఉపాధి, శిక్షణపై విస్తృత అధ్యయనం 

Published on Wed, 07/26/2023 - 04:39

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి వియత్నాం పర్యటన ముగిసింది. ఏపీ యువతకు ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, వృత్తి విద్య, శిక్షణపై అధ్యయనమే లక్ష్యంగా దక్షిణ కొరియా, వియత్నాం దేశాలలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పది రోజుల పర్యటించారు. ఈ పర్యటనలో చివరి రోజైన మంగళవారం హోచిమిన్‌ సిటీలోని సైగాన్‌ హైటెక్‌ ఇండ్రస్టియల్‌ పార్క్‌లో ఉన్న అంతర్జాతీయ ఎల్రక్టానిక్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను అధికారుల బృందంతో కలసి సందర్శించారు.

పార్కును తీర్చిదిద్దిన తీరు, టెక్నాలజీ అంశాలపై సైగాన్‌ హైటెక్‌ పార్కు అధ్యక్షుడు న్గుయెన్‌ అన్హ్‌ థీని అడిగి తెలుసుకున్నారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలపై ప్రతినిధులతో చర్చించారు. పెద్దఎత్తున యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

వాణిజ్యం, పెట్టుబడులు, వృత్తి శిక్షణలో సహకారం, అవకాశాలపై మన అధికారుల బృందం అధ్యయనం చేసింది. వియత్నాంలోని అతిపెద్ద సీఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ‘మోవి’ని మంత్రి బుగ్గన సందర్శించారు. సాల్మన్‌ ఫిష్‌ (మాఘ చేప), ట్యూనా ఫిష్‌ (తూర చేప)లను శుద్ధి చేసే యూనిట్లోని టెక్నాలజీని అడిగి తెలుసుకున్నారు. డాంగ్‌ నై ప్రావిన్స్‌ వైస్‌ చైర్మన్‌తో ఆర్ధిక మంత్రి బుగ్గన సమావేశమై. ఏపీలో పర్యటించాలని వైస్‌ చైర్మన్‌ను ఆహ్వానించారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు