Breaking News

గణనాథుని బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

Published on Wed, 09/20/2023 - 03:07

యాదమరి (చిత్తూరు జిల్లా): కాణిపాక శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో మంగళవారం ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలకు అర్చకులు శేఖర్‌ గురుకుల్, వేదపండితులు సుబ్బారావు పూజలు చేశారు. ఉదయం ఆలయ ప్రాంగణంలోని అన్వేటి మండపంలో స్వర్ణ ధ్వజస్తంభం వద్ద మూషికపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించడం కోసం ధ్వజస్తంభానికి క్షీర, చందన, ఇతర ద్ర­వాలతో అభిషేకం చేశారు.

ఈ ఉత్సవాలకు ఉభయదారులుగా కాణిపాకం, అగరంపల్లె, కారకాంపల్లె, వడ్రాంపల్లె, తిరువణంపల్లె గ్రామాలకు చెందిన శీర్‌కరుణీక వంశస్తులు వ్యవహరించారు. సిద్ధి, బుద్ధి, వినాయక స్వామి ఉత్సవమూర్తులను ఆలయ అ­న్వే­టి మండపంలో పుష్పాలతో అలంకరించి పూ­జ­­లు నిర్వహించి పుర వీధులలో ఊరేగించారు. రాత్రి ఆలయాధికారులు ఉభయదారులు మేళతాళాలతో ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చి పుష్పాలతో అలంకరించిన హంస వాహనంపై ఆశీనులు చేయగా... స్వామివారు దానిపై విహరించారు. 

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి  వినాయకుడికి సోమవారం ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టు వ్రస్తాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో చవితిరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వామివారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఆనవాయితి. ఈ ఏడాది మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు, ఎమ్మెల్యే వెంకటేగౌడ్‌ ఊరేగింపుగా పట్టువ్రస్తాలను తీసుకువెళ్లారు. వీరికి ఆలయ చైర్మన్, ఈవో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. ఆశీర్వాద మండపంలో వేదపండితులచే ఆశీర్వాదాలు చేయించి, ప్రసాదం, చిత్రపటం అందించారు. మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)