Breaking News

బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

Published on Sat, 11/11/2023 - 04:05

భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పి.విశ్వరూప్, జోగి రమేశ్, మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పేరి కామేశ్వరరావు (పీకే రావు) ప్రమాణ స్వీకారం చేశారు.

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో బ్రాహ్మణుల సమస్యలు తెలిసిన పేరి కామేశ్వరరావు వంటి సీనియర్‌ నాయకుడిని కార్పొరేషన్‌ చైర్మన్‌గా సీఎం జగన్‌ నియమించడం అభినందనీయమన్నారు. విశ్వరూప్‌ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం కలిగిన పేరి కామేశ్వరరావు బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ రానున్నకాలంలో బ్రాహ్మణులకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కోన రఘుపతి మాట్లాడుతూ వంశపారంపర్య అర్చకత్వం, అర్చకులకు వేతనాల పెంపు సీఎం జగన్‌ పాలనలోనే జరిగాయని చెప్పారు.

మల్లాది విష్ణు మాట్లాడుతూ అర్హులైన బ్రాహ్మణులకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా రూ.600 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. పేరి కామేశ్వరరావును దేవదాయశాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విజయవాడ మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ, ఏపీ అర్చక సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ఆత్రేయ బాబు, అనంతబాబు, కార్పొరేషన్‌ జీఎం జి.నాగసాయి, పలు బ్రాహ్మణ సంఘాల నాయకులు అభినందించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఎండీ సుసర్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)