Breaking News

ప్రైవేట్‌ వ్యక్తి చేతిలో ‘పోలింగ్‌’ ప్రక్రియ

Published on Wed, 01/22/2025 - 05:36

సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలకమైన ఓటర్ల జాబితా ప్రక్రియ పర్యవేక్షణ అంతా ఒక ప్రైవేట్‌ వ్యక్తి చేతిలో పెడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌గా ప్రైవేట్‌ వ్యక్తి బోడపాటి అనిల్‌ను నియమించడం చర్చ నీయాంశమైంది. 

తొలుత ఏడాది పాటు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నెలకు రూ.1.40 లక్షల వేతనంతో ఈయన పని చేస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎంపిక కమిటీ సిఫారసుతో ఈయన్ను నియమించామని తెలిపారు. ఎంపిక కమిటీలో ఎవరున్నారనేది ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌–నెట్‌ను ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌ అమలు చేస్తారని తెలిపారు. 

ఈవీఎంలు, సాప్ట్‌వేర్‌ ట్రాకింగ్‌తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సర్వం ఇకపై బోడపాటి అనిల్‌ పర్యవేక్షణలో ఉంటాయి. తద్వారా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్‌ ప్రక్రియలో పారదర్శకతకు పాతర వేయడమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌ విధులు ఇలా.. 
»  ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏటా నిరంతర నవీకరణ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ–సేవా, మీ–సేవా కేంద్రాల ద్వారా ఎలక్టోరల్‌ రోల్స్‌లో పేరు చేర్చడం, పీవీసీ కార్డుల జారీ కోసం పౌర సేవల దరఖాస్తు అమలు స్థితిని రోజువారీ పర్యవేక్షించడం. 
»  రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం ట్రాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు సంబంధించిన వివిధ సమస్యలను పర్యవేక్షించడం. 
»  ఎస్‌ఎంఎస్‌ గేట్‌వే ఏకీకరణ, ఎస్‌ఎంఎస్‌ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయడం.  
»   కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్‌ అమలు పర్యవేక్షణ. ఐటీ అప్లికేషన్స్‌ (ఇఆర్‌ఓ–నెట్, సైబర్‌ సెక్యూరిటీ, ఈ–రోల్‌ పర్యవేక్షణ), ఫామ్‌ 1–8 డేటా పర్యవేక్షణ, జిల్లా అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం. 
»  కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ల పర్యవేక్షణతో పాటు పోలింగ్‌ కేంద్రాల్లో లైవ్‌ వెబ్‌ కాస్టింగ్, కౌంటింగ్‌ అండ్‌ ఇండెక్స్‌ కార్డు అప్లికేషన్ల పర్యవేక్షణ.  
»   కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలతో ఆన్‌లైన్‌ కార్యకలాపాలు, ఐటీ సంబంధిత కార్యకలాపాల పర్యవేక్షణ. వీటితో పాటు ఓటర్ల జాబితా సవరణకు ముందు తీసుకోవాల్సిన చర్యలను పూర్తి చేయడం. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)