Breaking News

AP: వచ్చీ ఉపయోగం లేదు

Published on Tue, 09/03/2024 - 09:29

సాక్షి ప్రతినిధి: వరద నీరు ముంచెత్తి ప్రజలు దిక్కుతోచక ఇళ్లలోనే బందీలై సాయం కోసం హాహాకారాలు చేస్తుంటే ఒక రోజు తరువాత తీరిగ్గా బోట్లను తెప్పించింది ప్రభుత్వం. పోనీ అప్పుడైనా అన్నింటినీ రంగంలోకి దిగి బాధితులను ఒడ్డుకు చేర్చిందా అంటే అదీ లేదు. ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన పడవలను లారీల నుంచి కిందకు దించలేదు. రోడ్లమీదే ఆ లారీలను నిలిపివేశారు. దీంతో అవి వచ్చినా ఉపయోగంలేకపోయింది. కొన్ని బోట్లు అధికారులు, రాజకీయ నాయకులను తిప్పడానికే సరిపోయాయి. దీంతో ప్రైవేటు బోట్ల నిర్వాహకులు పలువురు బాధితులను దోచుకొన్నారు. 

ఒడ్డుకు చేర్చడానికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకూ డిమాండ్‌ చేశారని బాధితులు సాక్షి బృందం వద్ద తమ గోడును చెప్పుకున్నారు. ‘ఆదివారం నుంచి వరదలోనే ఉన్నాం. అధికారులెవరూ పట్టించుకోలేదు. స్థానికంగా ఉండే కుర్రాళ్లు కొందరు నన్ను, నా మనమరాళ్లను బయటకు తీసుకువచ్చారు. మనుమడు ఇంకా వరదలోనే ఉన్నాడు. బోట్ల వారిని అడిగితే రూ.10 వేలు అడిగారు. అంత డబ్బు మా దగ్గర ఎలా ఉంటుంది? సింగ్‌ నగర్‌ వంతెనపైనే తిండి, నీరు లేకుండా కూర్చున్నాం. ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని పోలీసులు తరుముతున్నారు. ఎక్కడికిపోవాలి? ఎలా బతకాలి?’ అంటూ రాజరాజేశ్వరిపేటకు చెందిన దుర్గమ్మ కన్నీరు పెట్టుకుంది.  

ఎంతగా బతిమిలాడినా పంపలేదు: 10 మంది చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నారని, బోట్లు పంపాలంటూ ఎంతగా బతిమిలాడినా పంపలేదని నందమూరి నగర్‌ 10వ లైన్‌కు చెందిన రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)