Breaking News

దేశాభివృద్ధిలో రాజీలేని తత్వం వాజ్‌పేయిది

Published on Mon, 12/26/2022 - 05:30

సాక్షి, అమరావతి: దేశాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే పరి­మితం కాకుండా దేశ రక్షణ అవస­రాల పరంగానూ మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారి వాజ్‌­పేయి రాజీ పడలేదని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొ­న్నారు. దేశాభివృద్ధి విష­యంలో ఆయన ఎంతో ముందుచూపుతో వ్యవ­హరించారన్నారు. వాజ్‌పేయి జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆదివారం సుపరి­పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ­హించారు.

దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్య­క్రమంలో వాజ్‌పేయి చిత్రపటా­నికి గవర్నర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సం­దర్భంగా గవర్నర్‌ విశ్వభూషణ్‌ మాట్లా­డుతూ.. దేశాభివృద్ధికి వాజ్‌పేయి చేసిన కృషి మరువలేని­దని ‘స్వర్ణ చతుర్భుజి’ కార్యక్ర­మాన్ని ప్రారంభించి దేశంలో మౌలిక సదుపా­యాల అభివృద్ధికి మార్గం చూపారన్నారు. నాలుగు మెట్రో­పాలి­టన్‌ నగరాలను కలు­పుతూ ఏర్పాటు చేసిన హైస్పీడ్‌ జాతీయ రహ­దారుల ప్రాజెక్ట్‌ ఫలాలను ఇప్పుడు ప్రజలు ఆస్వాదిస్తున్నార­న్నారు.

60 ఏళ్లు పైబడిన పేద వృద్ధులకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసి సంక్షేమ రంగంలో కొత్త ఒరవడి సృష్టించారని గుర్తు చేశారు. గ్రామాలను కలుç­³#తూ ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన, ప్రాథమిక, మాధ్యమిక విద్య నాణ్యతను పెంపొందించేందుకు సర్వశిక్షా అభియాన్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వాజ్‌పేయి హయాంలో ప్రారంభమయ్యాయన్నారు.

అణుపరీక్షల వేళ ప్రపంచంలోని పెద్ద శక్తులు వాజ్‌పేయిపై విరుచుకుపడగా ఐదు పరీక్షలను విజయవంతంగా పూర్తి­చేసిన తరువాత అణుశక్తి దేశంగా భారత్‌ను ప్రకటించారని గుర్తు చేసారు. వాజ్‌పేయి ధైర్యవంతమైన చర్యల ఫలితంగా ప్రవాస భారతీ­యులు గర్వంగా, గౌరవంగా జీవించగలుగుతున్నారని గవ­ర్నర్‌ హరి­చం­దన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్‌భవన్‌ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాశ్, ఉపకార్యదర్శి నారా­యణస్వామి, పలువురు మాజీ సైనికాధికారులు పాల్గొన్నారు. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)