Breaking News

వణికిస్తున్న బర్డ్‌ఫ్లూ.. చికెన్ షాపుల మూసివేతకు ఆదేశాలు

Published on Tue, 02/11/2025 - 15:42

సాక్షి,పశ్చిమగోదావరి : గోదావరి జిల్లాలను బర్డ్‌ఫ్లూ వణికిస్తోంది. కోవిడ్‌ పరిస్థితుల్ని బర్డ్‌ ఫ్లూ రెడ్‌ జోన్‌ ప్రాంతం తలపిస్తోంది. బర్డ్‌ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్ కిలోమీటర్‌ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.

తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుఎంజాగా నిర్ధారణైంది. దీంతో కాళ్ల మండలం పెద్ద అమీరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం, వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్‌ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా విధించారు.

ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ జోన్ నుండి 1-10 కి.మీ. ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా (అలర్ట్ జోన్) గుర్తించారు. అదే సమయంలో వ్యాధి సోకిన, హెచ్చరిక జోన్ (0-10 కి.మీ) లోపల, వెలుపల కోళ్లు, గుడ్ల రవాణా నిషేధం విధించారు. చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్,ఎగ్స్‌ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. 

Bird Flu : చికెన్ తినకండి

మరోవైపు, బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. కోళ్లు, బాతులతో వస్తున్న లారీలను వెనక్కి పంపుతోంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)