దశాబ్దాల సమస్యకు దారి చూపిన జగన్‌

Published on Wed, 01/25/2023 - 19:26

సి.బెళగల్‌(కర్నూల్‌ జిల్లా): కోడుమూరు, కృష్ణగిరి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు 70 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు దారి చూపిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం వద్ద హంద్రీ నదిపై వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు, ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్, పాణ్యం, పత్తికొండ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, కుడా చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి తదితరులు హాజరయ్యారు. 

హంద్రీ ఒడ్డున భూమిపూజ చేసి శిలా ఫలకాన్ని వీరు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ మాట్లాడుతూ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 24 కోట్లు మంజూరు చేయడంతో పలు గ్రామాల ప్రజల కష్టా లు తొలగిపోతున్నాయన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి గెలిపించుకుందామన్నా రు.

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడు తూ ప్రజా సంకల్ప యాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంత ప్రజల కష్టాలు చూసి చలించి, అధికారంలోకి వస్తే వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చారన్నారు. కృష్ణగిరి, కోడుమూరు ప్రజలు ఎప్పటికీ జగనన్న మేలు మరువరన్నారు. కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో  ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రజల వద్దకు పంపుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)