Breaking News

బీఎఫ్‌ఎస్సీలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

Published on Tue, 08/13/2024 - 05:22

సాక్షి, అమరావతి: ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం(నరసాపురం)లో 2024–25 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ (బీఎఫ్‌ఎస్సీ) నాలుగేళ్ల కోర్సులో సీట్ల భర్తీ కోసం యూనివర్సిటీ రిజి్రస్టార్‌ ఒ.సుధాకర్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.‡ నరసాపురంలోని కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌లో 60 సీట్లు, ముత్తుకూరులోని కాలేజ్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌లో 40 సీట్లు చొప్పున మొత్తం 100 సీట్లు ఉన్నాయి. 

పది శాతం సూపర్‌న్యూమరీ సీట్లను ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. 25 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇస్తారు. ఈ కోటాలో సీట్లకు దరఖాస్తు చేయాలంటే విద్యార్థులు నాలుగేళ్లు గ్రామీణ పాఠశాలల్లో చదివి ఉండాలి. తల్లిదండ్రులు లేదా విద్యార్థి కనీసం ఎకరం భూమి కలిగి ఉండాలి. మొత్తం సీట్లలో 85 శాతం స్థానికులకు ఇస్తారు. 

మిగిలిన 15 శాతం సీట్లకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీపడవచ్చు. ఫిజికల్‌ సైన్స్, బయోలాజికల్‌ నేచురల్‌ సైన్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఏపీఈఏపీసెట్‌–2024 ర్యాంక్‌ ఆధారంగా వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 20వ తేదీ లోగా యూనివర్సిటీ వెబ్‌ సైట్‌ (ఠీఠీఠీ.్చpజu.్చp.జౌఠి.జీn) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సెపె్టంబర్‌ 10న సీట్లు కేటా­యిస్తారు. ఇతర వివరాల కోసం 0866–3500560, 8985318321 నంబర్లలో సంప్రదించాలి.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)