సీలేరు రేంజ్‌లో బెంగాల్‌ టైగర్‌ సంచారం

Published on Mon, 01/13/2025 - 04:52

సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతమైన సీలేరు అటవీ రేంజ్‌ పరిధిలో సప్పర్ల రెయిన్‌ గేజ్‌ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై ఆదివారం ఉద­యం 7.30 గంటల సమయంలో రోడ్డుపై పెద్ద పులి (బెంగాల్‌టైగర్‌) ప్రయాణికుల కంటపడింది. రోడ్డు దాటుతుండగా అదే సమయంలో పాడేరు డిపోకు చెందిన బస్సు డొంకరాయి నుంచి సీలేరు మీదుగా పాడేరు వెళ్తుండగా సప్పర్ల రెయిన్‌గేజ్‌కు వెళ్లే సరికి పులి రోడ్డు దాటుతోంది. బస్సు రావడంతో పులి భయపడి రోడ్డుపై అటూ ఇటూ పరుగులు తీసింది. దీంతో బస్సు డ్రైవరు చాకచక్యంతో వ్యవహరించి హారన్‌ కొట్టడంతో అడవిలోకి పారిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఇదివాస్తవమా? కాదా? అన్నదానిపై సీలేరు డెప్యూటీరేంజ్‌ అధికారి సీహెచ్‌ సింహాచలం పడాల్, తోకరాయి సెక్షన్‌ ఆఫీసర్‌ వివేకానందరావు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ రాకేశ్‌ కుమార్‌ కలిసి పులి సంచరించిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు దాటిన ప్రాంతంలో పులి కాలిముద్రలను సేకరించి పులి జాడపై ఆరా తీశారు. పది రోజుల క్రితమే ఈ ప్రాంతానికి పులి వచ్చిందని, పాఠశాలకు వెళ్లే ఉపాధ్యాయులకు నాలుగు రోజుల కిందట అరుపులు కూడా వినబడినట్లు తెలిసిందన్నారు.

ఈ మధ్య కాలంలో ఒడిశా ప్రాంతంలోనూ, అల్లూరి జిల్లా చింతూరు ఏరియాలోనూ సంచరించేదని, ఆ పులే ఈ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనిపై రేంజ్‌ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీలేరు రేంజ్‌ పరిధిలో 50 ఏళ్లకాలంలో పెద్ద పులి లేదన్నారు. సరిహద్దులోని ఒడిశా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దారితప్పి ఈ ప్రాంతానికి వచ్చినట్లు నిర్ధారించామని, చింతూరు ఏజెన్సీ పరిధిలోని కాలిముద్రలు, సీలేరు పరిధిలో కాలి ముద్రలు పరిశీలిస్తామన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)