మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
మూడురోజులు ముప్పుతిప్పలు.. ఎలుగుబంటి అనూహ్య మృతి!
Published on Tue, 06/21/2022 - 18:44
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరులో గత మూడు రోజులుగా అందరినీ టెన్షన్ పెట్టిన ఎలుగుబంటి ప్రాణాలు కోల్పోయింది. సోమవారం పలువురిపై దాడి చేసి గాయపరిచిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు మంగళవారం ఉదయం మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. అయితే అస్వస్థతకు గురయిన ఎలుగుబంటి రెస్య్కూ సెంటర్‌లో చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది.
అయితే ఎలుగుబంటి మృతిపై కారణాలు తెలియాల్సి ఉందని జూ అధికారులు అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆదివారం కిడిసింగిలో జీడి రైతు కోదండరావుపై దాడిచేసి ప్రాణాలు తీసిన ఈ ఎలుగుబంటి సోమవారం ఆరుగురిని గాయపరచడంతో ఉద్దానమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.
చదవండి: (14 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థం)
Tags : 1