నింగిలోకి బెలూన్‌ శాటిలైట్‌

Published on Sun, 07/28/2024 - 05:29

చంద్రగిరి (తిరుపతి జిల్లా): వాతావరణంలోని మార్పులు, పీడనతో పాటు మరికొన్ని విశేషాలను తెలుసుకునేందుకు మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) విద్యార్థులు, ఎన్‌ఏఆర్‌ఎల్, ఐఐఎస్‌టీ సహకారంతో రూపొందించిన బెలూన్‌ శాటిలైట్‌ శనివారం నింగిలోకి ఎగిరింది. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాన్సలర్‌ మోహన్‌బాబు, ప్రో చాన్సలర్‌ మంచు విష్ణులతో పాటు ఇస్రో చంద్రయాన్‌–3 ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ వీర ముత్తువేల్, డాక్టర్‌ కల్పన కాళహస్తి, ఓషన్‌ శాట్‌–3 మిషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ తెన్ముయి శెల్వి , గ్రూపు డైరెక్టర్‌ గోపికృష్ణతో పాటు ఎన్‌ఏఆర్‌ఎల్, ఐఐఎస్‌టీ శాస్త్రవేత్తలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఉదయం 11.15 గంటలకు విద్యార్థులు రూపొందించిన ఎంబీయూ శాట్‌–1ను మోహన్‌బాబుతో పాటు శాస్త్రవేత్తలు లాంచ్‌ చేశారు. 

ఎన్‌ఏఆర్‌ఎల్‌తో భాగస్వామ్యం ద్వారా రూ.1.5 లక్షల తక్కువ ఖర్చుతో విజయవంతంగా నిర్వహించిన ఈ బెలూన్‌ శాటిలైట్‌ ఇతర విశ్వవిద్యాలయాలకు ప్రామాణికంగామారుతుందని విద్యార్థులు చెప్పారు. సుమారు 5 కేజీల బరువుతో 35 కి.మీ. ఎత్తులో 200 కిలోమీటర్ల వరకూ ఈ శాటిలైట్‌ ప్రయాణిస్తుందని చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా ఒక యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన శాటిలైట్‌ విజయవంతం కావడం సంతోషకరమని యూనివర్సిటీ చాన్సలర్‌ మోహన్‌బాబు చెప్పారు.    

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)