Breaking News

పూల ధర ఢమాల్‌..!

Published on Sun, 11/30/2025 - 05:17

రామభద్రపురం: నిన్నమొన్నటి వరకు వరుస తుఫాన్లు వివిధ పంటలపై ప్రభావం చూపాయి. అధిక వర్షాలు పంటలకు నష్టం చేకూర్చి రైతుకు కన్నీరుమిగిల్చాయి. పెట్టుబడి పెట్టి ఏదోలా పంటలను కాపాడుకుంటే దిగుబడులు అమాంతం తగ్గాయి. వారం రోజులుగా ధరలు కూడా పతనం కావడంతో పూల రైతులు కుదేలవుతున్నారు. కిందటి వారం వరకు విజయనగరం జిల్లా రామభద్రపురం అంతర రాష్ట్రమార్కెట్‌లో రూ.450 నుంచి రూ.500 పలికిన కేట్‌ (ట్రే) బంతి పూలధర ఇప్పుడు రూ.100కు పడిపోయింది.

ఆ ధరకు కూడా పూలు కొనుగోలు చేసేవారి కోసం రైతులు మార్కెట్‌లో ఎదురుచూడాల్సిన దుస్థితి. పూల రైతు కుదేలవుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. మద్దత ధర కల్పించే మార్గం చూపడంలేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నకు కష్టాలు, కన్నీరే మిగులుతాయని నిట్టూర్చుతున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, అరటి, ఉల్లి వంటి ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదంటూ రైతులు దిగులుచెందుతున్నారు.  

పెట్టుబడి కూడా రాదు 
ఈ ఏడాది వరుస తుఫాన్‌ వర్షాలకు బంతి పంట పూర్తిగా పాడయింది. ఉన్నకాడికి మొక్కలను బతికించాం. సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో మొక్కలు పూతకొచ్చాయి. ఇప్పుడు ధర లేదు. రామభద్రపురం మార్కెట్‌లో మూడు కేట్‌లు (ఒక్కో కేట్‌లో సుమారు 1000పూలు) రూ.200కు విక్రయించాను. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు.  – తూముల ఈశ్వరమ్మ, పూల రైతు, రామభద్రపురం      

కొనుగోలు చేసేవారే లేరు  
ఆరుగాలం శ్రమించి వేలకువేలు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశాను. మంచి దిగుబడి వచ్చే సమయానికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేదు. ఎంతో కొంతకు అమ్ముదామనుకున్నా కొనేవారు కరువయ్యారు. కార్తీక మాసం పూర్తికావడం, శుభకార్యాలు లేకపోవడంతో బంతిపూలకు డిమాండ్‌ తగ్గింది. ఖర్చులు అధికం కావడంతో నష్టాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. – కర్రి లక్ష్మణ, పూలరైతు, రామభద్రపురం 
 

#

Tags : 1

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)