Breaking News

నల్లమలకూ ఓ వీరప్పన్‌!

Published on Tue, 04/30/2024 - 01:55

విలువైన కలపను టోకుగా కాజేశాడా నేత.. నల్లమల వీరప్పన్‌గా పేరుమోశాడాయన.. నాటుసారా వ్యాపారంలో అందెవేసిన చేయి.. తన సారా వ్యాపారానికి అడ్డొచ్చి న వారి అంతు చూడడానికి సైతం వెనుకాడనంత దౌర్జన్యపరుడు.. ఈ అక్రమాలన్నిటితో రూ.వేల కోట్లను అనతికాలంలోనే ఆర్జించి.. తన దోపిడీ సామ్రాజ్యాన్ని బలపరుచుకున్న నేత.. అక్కడి జనాన్ని తన కంటి చూపుతో శాసించారు.

సారా వ్యతిరేకోద్యమం ముమ్మరంగా రాష్ట్రంలో ఊపేస్తే.. అప్పటి ఈ టీడీపీ నేత నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఈయనకు వ్యతిరేకంగా గొంతెత్తడానికి సాహసించలేకపోయారంటే జనాన్ని ఎంతగా భీతిగొలిపారో అర్థం చేసుకోవచ్చు. తుదకు తనఅక్రమాలకు మద్దతిచ్చే టీడీపీలో చేరారు.. అదొక్కటే కాదు.. అవకాశవాదంతో ఏ ఎండకా గొడుగు పడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లోనూ చేరారు.. ఈ నేత నీడన పెరిగిన ఆయన తనయ ప్రస్తుతం టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

సాక్షి, టాస్‌్కఫోర్స్‌: ఆ పేరు వింటే చాలు నల్లమల వీరప్పన్‌ గుర్తుకు వస్తారు. కొన్నేళ్ల కిందట నల్లమల అడవిని అడ్డాగా చేసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. కలప చెట్లను ఇష్టానుసారం నరికి హైదరాబాద్‌కు తరలించి రూ. వేల కోట్లు సంపాదించారు. తనకు ఎదురుమాట్లాడితే వారి పని అంతే. అడ్డుకుందామని యతి్నంచిన అధికారులను నయానో భయానో లొంగదీసుకుని తన వ్యాపారాన్ని సాగించారు. అంగబలానికి తోడు అర్ధబలం తోడవడంతో ఆయన అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయింది.  

తండ్రి రాజకీయ అండతో..: తండ్రి రాజకీయ అండతో ఈ నేత విచ్చలవిడిగా సంపాదించారు. జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు, ఓర్వకల్లు మండలాల్లో సొంతంగా సారా అంగళ్లు తెరిచారు. పల్లెలకు సారాను పరిచయం చేశారు. సారా వల్ల అనేక వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సారా అంగళ్లను తమ గ్రామాల్లో తొలగించాలని మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా, తన అంగబలంతో వాటిని అణచివేశారు.

1989లో రాష్ట్ర వ్యాప్తంగా సారాకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిచాయి. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. రోడ్ల మీదకి వచ్చి తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న సారా రక్కసిని పారదోలాలని రాష్ట్రమంతటా నినదించారు. ఒక్క నందికొట్కూరు నియోజకవర్గంలో మాత్రమే సారా ఉద్యమం చేయాలంటే గజగజ వణకాల్సిన పరిస్థితిని ఈ నేత సృష్టించారు. ఉద్యమం చేస్తే తమను ఏం చేస్తారోనన్న భయం నియోజకవర్గ ప్రజలను వెంటాడింది. ఉద్యమం పెద్ద ఎత్తున ఎగసిపడిన రోజుల్లోనూ స్థానికంగా మాత్రం సారా వ్యాపారం విచ్చలవిడిగా సాగిపోయింది. 

రూ.కోట్లలో విభేదాలతో బయటకు... 
1993లో ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డితో సారా కాంట్రాక్టు విషయంలో ఈ నేతకు విభేదాలు వచ్చాయి. తన సారా వ్యాపారానికి సహకరించడంలేదన్న కోపంతో ఆయన టీడీపీలో చేరి 1994లో నందికొట్కూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. అక్షరాస్యత పెద్దగా లేని నాటి రోజుల్లో అమాయక ప్రజలను తన రాజకీయ లబ్ధి కోసం ఈ నేత  వాడుకున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఫ్యాక్షన్‌  రాజకీయాలు చేపట్టి ఎంతో మంది మహిళల పుస్తెలు తెంపిన ఘన చరితా ఈయనదేనన్న ఆరోపణలు ఉన్నాయి.  

రెండోసారి ఎన్నికవడంతో.... 
1999 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ నేత ఆగడాలు శృతిమించాయి. నల్లమల అడవిని చెరబట్టి అటవీ సంపదను కొల్లగొట్టారు. విలువైన కలపను ఇతర ప్రాంతాలను రవాణా చేసి రూ.కోట్లు గడించారు. అటవీ అధికారులను బెదిరించి విలువైన కలప చెట్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు తరలించి రూ.వేల కోట్లు సంపాదించారు. ఆ నేత ఇంటిలో, హైదరాబాద్‌లోని హోటల్లో  ఎక్కడ చూసినా విలువైన కలప కళాఖండాలు కనిపిస్తాయని ఉమ్మడి కర్నూలు ప్రజలందరికీ తెలుసు. బీడీల కట్టలు కట్టి అమ్ముకునే నిరుపేదల రక్తం తాగారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 

కార్మికుల నుంచి కారుచౌకగా బీడీ కట్టలను కొనుగోలు చేసి తాను మాత్రం ఎక్కువ రేటుకు విక్రయించి లాభాలు గడించారు. ఆ నేతకు వ్యతిరేకంగా మాట్లాడినా, ఆయన ఆగడాలను ప్రశి్నంచినా వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే. ఈ నేతకు విలేకరులంటే అలుసు. అప్పట్లో విలేకరుల సమావేశాలంటూ పిలిచి కురీ్చలు కూడా వేసేవారు కాదు. పాత్రికేయులు నిలుచునే ఆయన చెప్పేది నోట్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లా కేంద్రాలలో ఉండే ముఖ్య ప్రతినిధి వస్తే మాత్రమే కుర్చీ వేసేవారు.  

∗ 2004లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నేత వరుసగా పార్టీలు మారారు. కొద్ది రోజులు రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో హడావుడి చేశారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ ఇలా అన్ని పార్టీల్లోకి ఆయన వెళ్లొచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ ఊసరవెల్లి రాజకీయాలు సాగించిన ఘనత దక్కుతుంది.  

కేసులు.. 
వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడంతో ఆయనపై ఐపీసీ 341 కింద నియోజకవర్గంలో కేసు నమోదైంది. ఐపీసీ 143, 188, 149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 

తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న తనయ
తండ్రికి తానేమీ తక్కువకాదన్నట్లుగా ఆయన తనయ వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఈమె నోరు తెరిస్తే చాలు అవతలి వ్యక్తి హడలిపోవాల్సిందేనన్న విమర్శలు ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లెలో ఈమెపై క్రిమినల్‌ కేసు నమోదైంది. దళిత వ్యక్తిని దూషించడంతో పాటు దాడి చేయడంతో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈమె టీడీపీ తరఫున లోక్‌ సభకు పోటీ చేస్తున్నారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)