Breaking News

దేశంలో ‘టాప్‌’ గేర్‌... ఏపీలో ‘రివర్స్‌’ గేర్‌

Published on Sun, 02/16/2025 - 03:08

సాక్షి, అమరావతి: సాంప్రదాయికంగా చూస్తే జనవరిలో రిటైల్‌ వాహన విక్రయాలు భారీగా ఉంటాయి. ద్విచక్ర వాహన అమ్మకాలు ధమాకా సంగతి చెప్పనే అక్కర్లేదు. సంక్రాంతి నేపథ్యంలో ‘పెద్ద పండుగ కదా.. మీ మామగారు ఏమి బండి కొనిచ్చారు..?’ అని అడగడం ఇక్కడ సర్వసాధారణ అంశమన్న విషయం ప్రస్తావించాలి. అయితే 2025 జనవరిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏడీఏ) వెల్లడిస్తున్న గణాంకాలను పరిశీలిస్తే...  

⇒ దేశవ్యాప్తంగా ఆటోమొబైల్‌ అమ్మకాలు జనవరిలో  పరుగులు పెడితే ఒక్క ఏపీ మాత్రమే తిరోగమన దిశలో పయనించింది.
⇒  గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరి నెలలో దేశవ్యాప్తంగా ఆటోమొబైల్‌ అమ్మకాలు 7.05% పెరిగితే, మ­న రాష్ట్రంలో మాత్రం 9.41% పడిపోయాయి.

⇒ తమిళనాడు (6.99 శాతం), మహారాష్ట్ర (13.44 శాతం), పంజాబ్‌ (16.77 శాతం), హరియాణా (17.15 శాతం), ఉత్తరప్రదేశ్‌ (8.15 శాతం)లలో వాహన అమ్మకాలు పెరిగితే మన రాష్ట్రంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది.  
⇒ దేశవ్యాప్తంగా అన్ని రకాల వా­హనాల అమ్మకాలు గతే­డాది జనవరిలో 21,56,605 ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 23,08 ,728కి పెరిగింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం 70,815 నుంచి 64,149కి పడిపోయింది.

డబ్బులు లేవు
మొత్తం ఆటోమొబైల్‌ అమ్మకాల్లో 70 శాతంపైగా వాటా కలిగి ఉండే ద్విచక్రవాహనాల అమ్మకాలు దారుణంగా పడిపోవడం మధ్య తరగతి, పేద ప్రజల వద్ద డబ్బు లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.  వ్యవసాయ కార్మికుల దగ్గర నుంచి చిన్న ఉద్యోగి వరకు తొలుత కొనుగోలు చేసేది ద్విచక్రవాహనాలనే. ఒక రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయో అన్న విషయాన్ని పరిశీలించడానికి ద్విచక్ర వాహన అమ్మకాలను ప్రాతిపదికగా తీసుకోవచ్చు. కరోనా మహ­మ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా దెబ్బతిన్న ద్విచక్ర వాహన రంగం గడిచిన రెండేళ్లుగా వృద్ధిబాట పట్టింది.

అయితే  తిరిగి 2025 తొలి నెలలోనే క్షీణ బాట పట్టడం గమనార్హం. జనవరి నెలలో దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహన అమ్మకాలు 4.15% పెరిగితే, మన రాష్ట్రంలో మాత్రం 7.19% తగ్గాయి. గతేడాది 49,240గా ఉన్న ద్విచక్రవాహన అమ్మకాలు ఈ ఏడాది 45,697కు పడిపోయాయి. కోవిడ్‌ తర్వాత ద్విచక్ర వాహన అమ్మకాలు తగ్గడం కేవలం మన రాష్ట్రంలోనే చూస్తున్నామంటూ ఆటో డీలర్లు వాపోతున్నారు. గత ఏడాది జనవరిలో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 14.38 వృద్ధి నమోదయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

పడిపోయిన కొనుగోలు శక్తి 
కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత గడచిన ఏడు నెలల్లో ప్రజల్లో కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. వస్తు సేవల పన్ను ఆదాయం పతనం (జీఎస్‌టీ) దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రతీ నెలా ఈ వసూళ్లు రాష్ట్రంలో పడిపోతున్నాయి.

‘నిర్మాణ’ పటిష్టత ఎక్కడ     
ఉచిత ఇసుకతో రాష్ట్రంలో నిర్మాణ రంగం పరుగులు తీస్తోందంటూ కూటమి సర్కారు ప్రచారంలో నిజం లేదనడానికి నిర్మాణ రంగ వాహన అమ్మకాలు నిలువుటద్దంగా మారా­యి. గతేడాది జనవరి నెలలో నిర్మాణ రంగానికి చెందిన 168 వాహనాల అమ్మకాలు జరిగితే, అది ఈ ఏడాది 144కు పరిమితం అయ్యింది. అదే విధంగా గూడ్స్‌ క్యారియర్స్‌ అమ్మకాలు 23,898 నుంచి 2,054కు, ఆటో అమ్మకాలు 2,324నుంచి 2,054కు పడిపోయాయి. ఇవన్నీ రాష్ట్రంలో వాణిజ్య కార్యక్రమాలు నెమ్మదించాయని స్పష్టం చేస్తున్నాయి.

అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలేశారు... 
గడిచిన ఏడు నెలలుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం, సంక్షేమ పథకాలు ఆపేయడం, పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాలు ఆటోమొబైల్‌ అమ్మకాలపై గణనీయంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయంటున్నారు.  

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?