Breaking News

ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్‌

Published on Tue, 02/20/2024 - 03:32

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ ఫార్మా సంస్థ ఉత్పత్తికి సిద్ధమైంది. చైనా నుంచి ఫార్మా దిగు­మతులను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభు­త్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సా­హ­కా­లు (పీఎల్‌ఐ) స్కీం కింద లిఫియస్‌ పేరుతో అర­బిందో గ్రూపు పెన్సులిన్‌ జి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెన్సులిన్‌ తయారీలో కీలక ముడి­­పదార్థంగా పెన్సులిన్‌ జి వినియోగిస్తారు. కాకి­­నాడ సమీపంలోని తొండంగి వద్ద 250 ఎక­రాల్లో సుమారు రూ.2,205 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసు­కొని, ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది.

ఈ కర్మా­­గారంలో ఏటా 15,000 టన్నుల పెన్సులిన్‌ జి యూని­ట్, 2,000 టన్నుల సామర్ధ్యంతో 7–ఏసీఏ యూనిట్‌ను అరబిందో గ్రూపు ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌లో 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్‌ వాణిజ్య ఉత్ప­త్తికి సిద్ధమవడంతో లిఫియస్‌ ఉద్యోగ నియామ­కా­లు చేపట్టింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్‌ (బయో­­టెక్నా­­లజీ, మైక్రోబయాలజీ) కోర్సులు పూర్తి చేసిన వారిని వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు లిఫియస్‌ ప్రకటించింది.

ఈ నెల 22న హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌­పోర్టు వద్ద ఉన్న మనోహర్‌ హోటల్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వ­హిస్తారు. ఫెర్మిటేషన్స్‌లో ప్రొడక్షన్, మైక్రోబ­యో­లజీ రంగాల్లో నియామకాలకు తాజాగా కోర్సు పూర్తి చేసిన వారి (ఫ్రెషర్స్‌) దగ్గర నుంచి 10 ఏళ్ల అను­భవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తోంది. వాటర్‌ ట్రీట్‌మెంట్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కనీసం రెండేళ్ల అనుభవం నుంచి పదేళ్ల వారికి అవకాశం కల్పిస్తోంది.

మరో రెండు ఫార్మా యూనిట్లు
లిఫియస్‌కు సమీపంలోనే పీఎల్‌ఐ స్కీం కింద మరో రెండు ఫార్మా యూనిట్లు ఏర్పాటవుతు­న్నా­యి. అరబిందో గ్రూపు క్యూలే పేరుతో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో 159 ఎకరాల్లో ఎరిత్రోమైసిన్‌ థియోసేనేట్‌ యూనిట్‌ని ఏర్పాటు చేస్తోంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 1,600 టన్నులు. దీనికి సమీపంలోనే దివీస్‌ సంస్థ ఓ ఫార్మా యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది. దీని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూడు యూని­ట్లతో కాకినాడ మేజర్‌ ఫార్మా హబ్‌గా ఎదగనుంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)