Breaking News

ప్రైవేటు చేతికి హార్సిలీహిల్స్‌?

Published on Thu, 01/16/2025 - 06:10

బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌ జిల్లాలో ఏకైక పర్యాటక కేంద్రం. రాష్ట్రంలో ఏకైక పర్వత నివాస ప్రాంతం కూడా ఇదే. తిరుపతి డివిజన్‌ పరిధిలోని హార్సి­లీహిల్స్‌ టూరిజం యూనిట్‌ను ప్రైవేటుకు అప్ప­గించే యత్నాలు మొదలయ్యాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా ప్రైవేట్‌ ప్రతినిధులు హార్సిలీహిల్స్‌పైనున్న టూరిజం ఆస్తు­లపై పరిశీలన పూర్తి చేసినట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ విషయమై ఇటీవల సీఎం చంద్ర­బాబు కుప్పం పర్యటన సందర్భంగా యూనియన్‌ నేతలు వినతిపత్రం అందించారు. 

రూ.9.13 కోట్లతో పనులు 
హార్సిలీహిల్స్‌ అభివృద్ధి, అతిథి గృహాల ఆధునికీకరణపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి రూ.9.13 కోట్ల నిధులు కేటాయించింది. 

అతిథిగృహాల ఆధునికీకరణ, కొత్త నిర్మాణాల కోసం పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 54 అతిథి గృహాలుండగా గవర్నర్‌ బంగ్లాను మిన­హాయించి మిగిలిన గదులకు రంగులు, కొత్తగా రెస్టారెంట్‌ భవనం నిర్మాణ పనులను హైదరా­బా­ద్‌కు చెందిన కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకు­న్నా­రు. 

పర్యాటకశాఖ 2024 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌లోపు 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుంది. వైల్డ్‌ విండ్స్‌ భవ­నంలోని 8, విండ్‌ విస్టిల్‌ భవనంలోని 6, విండ్‌ఫాల్‌ భవనంలోని 4 అతిథి గృహాలను కాంట్రాక్టర్‌కు అప్పగించింది. 18 అతిథిగృహ­లను ఏప్రిల్‌ నుంచి పర్యాటకులకు కేటాయించడం లేదు. 

9నెలల్లో రూ.55 లక్షల నష్టం 
ఏప్రిల్‌ నుంచి 18 అతిథి గృహాలను పనుల కోసం కాంట్రాక్టర్‌కు అప్పగించడం, వాటిని పర్యాటకు­ల­కు అద్దెకు ఇవ్వకపోవడంతో పర్యాటకశాఖకు గడచి­న 9 నెలల్లో రూ.55 లక్షల నష్టం వాటిల్లినట్టు ఉన్న­తాధికారులకు సమాచారం. పనులు పూర్తి కా­కపో­వ­డంతో నెలకు రూ.6లక్షల నష్టం వస్తుంది. డిసెంబర్‌లో పనులు పూర్తి చేసి పర్యా­టకశాఖకు భవనా­లను అప్పగించాలి. ఇంత­వరకు ఒక్క గది ప­నీ పూ­ర్తి చేయలేదు. పనుల కోసం గదు­ల్లోని వాష్‌రూ­మ్‌­ల గోడలను పడగొ­ట్టి అలా ఉంచేశా­రు. 

ఆదాయం లేదని చూపే యత్నం
హార్సిలీహిల్స్‌ యూనిట్‌ను ప్రైవేటుకు అప్పగించాలన్న యత్నాల్లో భాగంగానే ప్రభుత్వంలోని ఓ అధికారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు చెబు­తున్నారు. ఏటా రూ.3.50 నుంచి రూ.4.50 కోట్ల వరకు హార్సిలీహిల్స్‌ ఆదాయం ఉంటుంది. అలాంటిది గదుల పనులు పూర్తి చేయకుండా ఆదాయం తగ్గిపోయేలా చేస్తే దాన్ని ప్రైవేటుకు అప్పగించవచ్చన్న ఆలోచనతో ఇలా చేస్తున్నారని టూరిజం ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)