Breaking News

డిప్యూటీ స్పీకర్‌ ఇలాకాలో.. దళితులపై పోలీసుల అమానుషం

Published on Thu, 08/07/2025 - 05:51

ఉండి: డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో దళితులపై అమానుష దాడి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాములపర్రులోని దళితుల శ్మశాన వాటికలో పక్క గ్రామానికి చెందిన ఆక్వా రైతుల కోసం ఆగమేఘాలపై రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న దళితులపై పోలీసులు విచక్షణా రహితంగా విరచుకుపడ్డారు. రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు చేసిన అధికారులను దళితులు ఇటీవల పలుమార్లు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. దీంతో.. బుధవారం పొక్లెయిన్‌తో ఒక్కసారిగా సర్వే బృందాలు, నలుగురు సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, మహిళా పోలీసులు, కానిస్టేబుళ్లు పెద్దఎత్తున రంగంలోకి దిగడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. 

దళితులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని తోసుకుంటూ ముందుకెళ్లారు. ముఖ్యంగా దళిత మహిళలపై దౌర్జన్యానికి తెగబడ్డారు. ముందుగా దళితులను రెచ్చ­గొట్టి వారు గొడవపడేలా చేసి వారిపై మహిళా పోలీసులను ఉసిగొల్పి ఆపై కానిస్టేబుళ్లను రంగంలోకి దించి వారిని కొట్టడం, దారుణంగా నెట్టేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ముఖ్యంగా మహిళా పోలీసులను పంపించి దళిత మహిళలపై దాడిచేసేలా పోలీసులు వ్యూహం రచించారు. అంతేకాక.. మహిళా పోలీసులు వారి వ్రస్తాలు లాగేందుకు బరితెగించారు. 

అయి­నా దళితులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోరాడుతూనే ఉన్నారు. దీంతో.. పోలీసులు సర్వే బృందాలను రెండుగా విభజించి ఒక బృందం స్థానికంగా ఉండేలా.. మరో బృందం కోలమూరు మీదుగా శ్మశానం చివరకు చేరుకుని ఆ వైపు నుంచి సర్వేచేసేలా పథకం రచించారు. ఇది గమనించిన దళితులు అక్కడికెళ్లి వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఒక దశలో విద్యుత్‌ మీటర్లను పట్టుకుని.. రోడ్డు వేయడం నిలిపివేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతామంటూ దళితులు హెచ్చరించారు.

దారుణంగా కొట్టడంతో.. 
సర్వే బృందాలను దళితులు అడ్డుకోవడంతో పోలీసులు నేరుగా దాడికి దిగారు. తేలి వెంకట్రావు అనే వ్యక్తిని ఉండి ఎస్సై ఎండీ నసీరుల్లా దారుణంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. ఎస్సైతో పాటు మరో ఏఎస్సై, కానిస్టేబుల్‌ కూడా అతడిపై దాడిచేసి పక్కనే వున్న బోదెలోకి తోసి కాళ్లతో తొక్కినట్లు దళితులు ఆరోపిస్తున్నారు. అపస్మారక స్థితికి చేరిన బాధితుడిని దళితులు పాములపర్రు రాష్ట్రీయ రహదారిపైకి తీసుకొచ్చి ధర్నా చేపట్టారు. అనంతరం బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. 

అంతకుముందే.. ధర్నా చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన పరదేశి అనే వ్యక్తి కూడా స్పృహ కోల్పోవడంతో అతడ్ని కూడా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో ఇతర మండలాల నుంచి పోలీసులు పెద్దఎత్తున రంగంలోకి దిగారు. అయితే, తాడోపేడో తేల్చేసుకుంటామంటూ ఇటు దళితులు, అటు సర్వే, పోలీసు అధికారులు పాములపర్రులోని శ్మశానం వద్దే మకాం వేసారు. 

డిప్యూటీ స్పీకర్‌ ప్రోద్బలంతోనే..
ఇదిలా ఉంటే.. దళితులపై దాడులకు డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశిస్తున్నారని బాధితులు  ఆరోపిస్తున్నారు. మా శవాలపై రోడ్డు వేయాలని, అప్పుడుగాని ఎమ్మెల్యేకి సంతోషంగా ఉండదేమో అని ఆందోళనకారులు  కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామానికి చెందిన నాయకులను కూడా భయభ్రాంతులకు గురిచేయడంతో వారంతా తమకు సహకరించడంలేదని ఆవేదన చెందుతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)