Breaking News

రేవ్‌ పార్టీకి పిలుస్తాడు.. రేప్‌ చేస్తాడు

Published on Tue, 07/29/2025 - 04:50

సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కొండాపూర్‌ రేవ్‌ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్‌కుమార్‌గా అక్కడి టాస్క్ ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. అతడి స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కాజ.  అశోక్‌కుమార్‌ వారాంతాల్లో ఏపీ నుంచి హైదరాబాద్‌కు యువతులను తీసుకెళుతుంటాడు. రేవ్‌ పార్టీల్లో వారితో అసభ్య నృత్యాలను చేయించడం, ఆపై డ్రగ్స్‌ మత్తులో ఉన్న యువతులపై అత్యాచారానికి పాల్పడటం అతడి నైజమని పోలీసులు గుర్తించారు.

అదే గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు కూడా అశోక్‌కుమార్‌కు రేవ్‌ పార్టీల్లో సహకరిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొండాపూర్‌ ఎస్వీ సర్విస్‌ అపార్టుమెంట్‌లో రేవ్‌ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో తెలంగాణ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్‌ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 9 మందిని అరెస్ట్‌ చేసి 9 కార్లను సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. రేవ్‌ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్‌కుమార్‌ నుంచి డ్రగ్స్, గంజాయి, కండోమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ అలవాటు ఉన్న యువతులనే అశోక్‌కుమార్‌ లక్ష్యంగా చేసుకుని రేవ్‌ పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అశోక్‌కుమార్‌ వైజాగ్‌లోని గీతం యూనివర్సిటీలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివాడు. 

వ్యసనాలకు బానిసగా మారిన అతడు కొంతకాలంగా ఈ దందాలో దిగినట్టు పోలీసులు గుర్తించారు. కొరియర్‌ సర్వీస్‌లో పనిచేస్తున్న ఒక యువకుడు పార్సిల్‌ ద్వారా గంజాయి విక్రయించేవాడని, అతడితో అశోక్‌కుమార్‌ ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత అశోక్‌కుమార్‌ కొరియర్‌ ద్వారా గంజాయి విక్రయించేవాడని సమాచారం. ఇతను ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో ఓ గంజాయి కేసు నుంచి అశోక్‌ను తప్పించారని చెబుతున్నారు. అశోక్‌ కాజ  స­మీపంలోని ఓ వర్సిటీ  విద్యార్థులకు కూడా గంజా­యి విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.  

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)