Breaking News

రామోజీ.. ఈ కథనం నువ్వు వేసిందేగా!

Published on Sat, 05/11/2024 - 05:16

సాక్షి, అమరావతి: ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని  వక్రీకరించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న రామోజీరావు 7 నెలల క్రితం దాన్ని జగన్‌ ప్రభుత్వం అమల్లోకి తేలేకపోతుందంటూ ఈటీవీ భారత్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. గతేడాది ఆగస్టు 11న ఈటీవీ భారత్‌లో ‘వైసీపీ ప్రభుత్వ ప్రచారాలకే పరిమితమైన చట్టాలు.. ఖాతాలో మరో యాక్ట్‌’ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులకు కూడా కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోలేకపోతున్నారని అందులో వివరించారు.  అసెంబ్లీలో ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను ఆమోదించినా కేంద్రం నుంచి అనుమతి తేలేకపోతున్నారని ఆక్షేపించింది.

అనేకసార్లు దిల్లీలో ప్రదక్షిణలు చేసిన సీఎం జగన్‌ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌కు కేంద్రం నుంచి ఆమో­దం పొందడంలో విఫలమయ్యారని ఆ కథనంలో రామోజీ గుండెలు బాదుకున్నారు. ఆ కథనం వచ్చిన కొద్దినెలలకే కేంద్రం ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ఆమోద­ముద్రా పడింది.  ఇప్పుడు ఏకంగా విష ప్రచారం చేయడం రామోజీ ద్వంద్వ నీతికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. ఎంతో విజన్‌ ఉన్న చట్టం అని చెప్పిన దాని గురించి ఇప్పుడు  తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఈ చట్టం వస్తే భూ యజమానులకు వరంగా మారుతుందని చెప్పిన ఈటీవీ ఇప్పుడు అది వస్తే భూములు పోతాయని రైతులను భయభ్రాంతులకు గురిచేసే కథనాలు వండి వారుస్తోంది. 

ఈ చట్టం గురించి వ్యతిరేక ప్రచారం చేసి భూములకు సంబంధించి వారిలో భయాలు సృష్టించి తద్వారా ఎన్నికల్లో చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు రామోజీ ఈ దిగజారుడు పాత్రికేయానికి తెగబడ్డారు. భూ హక్కుల చట్టంతో భూములకు భద్రత వస్తుందని ఈటీవీలో పలు కథనాలు ప్రసారం చేసి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు బురద జల్లడం ద్వారా తనకు కుట్రలు, కుతంత్రాలు తప్ప విలువలు, నీతి అనేదే లేదని రామోజీ నిరూపించుకున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)