Breaking News

వీరుడా.. సెలవిక

Published on Mon, 05/12/2025 - 05:46

పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమరుడైన ముదావత్‌ మురళీ నాయక్‌ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. తండోపతండాలుగా జనం శ్రీసత్యసాయి జిల్లా కల్లితండాకు తరలివచ్చి వీర జవాన్‌కు అశ్రు నివాళులర్మించారు. జోహార్‌ మురళీ నాయక్‌.. జై జవాన్‌.. భారత్‌ మాతాకీ జై.. వీరుడా ఇక సెలవు.. అంటూ నినదించారు.

సాక్షి, పుట్టపర్తి: కశ్మీర్‌లో విధి నిర్వహణలో ఉండగా పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన అగ్నివీర్‌ ముదావత్‌ మురళి నాయక్‌ అంత్యక్రియలు ఆదివారం ప్రభుత్వ లాంఛనాల మధ్య పూర్తయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా గోర­ంట్ల మండలం కల్లి తండాలో మురళి నాయక్‌ భౌతికకాయాన్ని చూసేందుకు ప్రజలు పోటెత్తారు. శనివారం రాత్రి  భౌతికకాయం స్వగ్రా­మానికి చేరుకోగా.. అప్పటి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు తండోపతండాలుగా జనం తరలివచ్చి వీర జవాన్‌కు అశ్రు నివాళులర్పించారు.

జోహార్‌ మురళి నాయక్‌.. మురళి నాయ­క్‌ అమర్‌ రహే.. జై జవాన్‌.. భారత్‌ మాతాకీ జై.. జై హింద్‌.. వీరుడా ఇక సెలవు.. అంటూ నినదించారు. తమ ఊరి యువకుడు దేశం కోసం ప్రాణాలర్పించడం ఓవైపు గర్వంగా ఉన్నప్పటికీ.. మరో వైపు తీవ్ర బాధతో ఉన్నామని గ్రామస్తులందరూ భావోద్వేగానికి గురయ్యారు. మురళి నాయక్‌ కుటుంబ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ పర్యవేక్షణలో కల్లి తండాలో ఏర్పాట్లు జరిగాయి.  కాగా, అగ్నివీర్‌ మురళి నాయక్‌ భౌతిక కాయం వద్ద ఘనంగా సైనిక వందనంతో నివాళులర్మించిన అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. 

అంత్యక్రియల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్‌ యాదవ్, సవిత, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకుముందు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమ­న్వయకర్తలు ఈర లక్కప్ప, దీపిక, మక్బు­ల్‌ తదితరులు మురళి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎస్పీ వి.రత్న నేతృత్వంలో కల్లి తండాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆస్తి ఇచ్చినా.. ఆనందం లేకపాయె
వీరజవాన్‌ మురళినాయక్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభు­త్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం, 5 ఎకరాల భూమి, 300 గజాల్లో ఇంటి నిర్మాణం, తండ్రి శ్రీరామ్‌ నాయక్‌కు ప్రభు­త్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి నారా లోకేశ్‌ ప్రక­టించారు. తన వంతు సాయంగా మరో రూ.25 లక్షలు ఇస్తానని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. అయితే ‘ఆస్తులు ఇచ్చినా.. ఇల్లు కట్టించినా.. అనుభవించేందుకు, ఆనంది­ంచేందుకు మా బిడ్డ లేకపాయె కద సారూ.. నా బిడ్డ దేశం కోసం ప్రాణాలొదిలాడని గర్వంగా అందరూ చెబుతున్నా.. కన్నపేగు బాధ ఎవ­రికి తెలుసయ్యా’ అంటూ మురళినాయక్‌ తల్లిదండ్రులు గుండెలు బాదుకుని విలపించా­రు. తామిక ఎవరి కోసం బతకాలంటూ కన్నీరు మున్నీరయ్యారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)