Breaking News

అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు

Published on Sat, 02/15/2025 - 04:29

నిడమర్రు: కొల్లేరు అభయారణ్యం పరిధిలోని జిరాయితీ భూముల్లో సంప్రదాయ ఆక్వా సాగు చేసుకొనే రైతులను కొందరు అటవీ శాఖ అధికారులు లంచాల కోసం పీడిస్తున్న వైనం బయటపడింది. ఎకరాకు రూ.10 వేలు ఇస్తేనే సాగుకు అనుమతిస్తామని, లేదంటే కేసులు పెడతామంటూ ఏలూరు జిల్లా నిడమర్రు రైతులను నిత్యం వేధిస్తుండటంతో... రైతులు ఈ వ్యవహారాన్ని వీడియో తీసి బయటపెట్టారు. రైతులు చెప్పిన వివరాల ప్రకారం..  కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఉన్న నిడమర్రు పంచాయతీ వెంకటాపురం గ్రామంలో 600 ఎకరాల వరకు పట్టాలు ఉన్న జిరాయితీ భూములు ఉన్నాయి. 

ఈ భూములకు డబ్బులు ఇస్తామని చెప్పిన అధికారులు నేటి వరకూ ఇవ్వలేదు. సాగు చేసుకునేందుకు కూడా అనుమతులివ్వలేదు. దీంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 20 ఏళ్లుగా ఇవి బీడు భూములుగానే ఉన్నాయి. ఇటీవల అటవీ శాఖ అధికారుల తరఫున ఏలూరు రేంజ్‌ కార్యాలయం సెక్షన్‌ అధికారి నబిగిరి శ్రీనివాస్‌ రైతులను కలిసి ఎకరాకు రూ.10 వేలు ఇస్తే సాగుకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.

సుమారు 200 మంది రైతుల నుంచి ఎకరాకు రూ.10 వేలు వసూలు చేశారు. నిడమర్రుకు చెందిన మండా పోలయ్యను కూడా 5 ఎకరాలకు రూ.50 వేలు డిమాండ్‌ చేశారు. పోలయ్య నుంచి ఈ నెల 6న ఇంటి ముందు రోడ్డుపైనే  రూ.30 వేలు నగదు తీసుకున్నారు. మిగతా రూ.20 వేలకు అదే పనిగా ఫోన్లు చేస్తుండటంతో ఫోన్‌పే నంబరు ఎవరిదైనా చెప్పండని పోలయ్య అడగ్గా.. తన ఫోన్‌కే వెయ్యండని చెప్పారు. దీంతో 10వ తేదీన శ్రీనివాస్‌కు రూ.10 వేలు పంపించారు.

మిగతా రూ.10 వేల కోసం చెరువుల వద్దకు వచ్చి హడావుడి చేస్తుండటంతో రైతులు విసిగిపోయారు. శ్రీనివాస్‌కు లంచం ఇస్తున్న సీసీ కెమెరా పుటేజ్, దూరం నుంచి సెల్‌ ఫోన్‌లో రికార్డు చేసిన వీడియో, రూ.10 వేలు ఫోన్‌ పే చేసిన స్క్రీన్‌ షాట్, ఆడియో రికార్డులను ‘సాక్షి’కి అందించి, వారి గోడు వెళ్లబోసుకున్నారు. కొల్లేరు అభయారణ్యంలో అన్‌ సర్వే భూముల్లో దర్జాగా ఆక్వా సాగు చేస్తున్న బడా బాబులను వదిలేసి, తమలాంటి పట్టా భూములున్న చిన్న, సన్నకారు రైతులను అధికారులు పీడిస్తున్నారని తెలిపారు. తమ భూముల్లో వ్యవసాయానికి అనుమతించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం: ఏలూరు డీఎఫ్‌వో డి. విజయ 
ఈ లంచాల వ్యవహారంపై ఏలూరు డీఎఫ్‌వో డి. విజయను వివరణ కోరగా.. సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు తన దృష్టికి రాలేదని చెప్పారు. ఈ విషయంలో తగిన విచారణ జరిపి,  వాస్తవం అయితే శ్రీనివాస్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

భూమి ఉన్నా ఆదాయం లేక కూలి పనికి వెళుతున్నా 
నాకు ఉన్న 4 ఎకరాలు 5వ కాంటూరు పరిధిలో ఉందంటూ 20 ఏళ్లుగా సంప్రదాయ వ్యవసాయానికి కూడా అధికారులు అనుమతించడంలేదు. దీంతో రైతు అయినా నేను కూలి పనులు చేసుకుంటున్నాను. భూములు తీసుకున్నందుకు అధికారులు పరిహారమూ ఇవ్వడంలేదు. సాగు చేసుకుంటే అటవీ శాఖ సిబ్బంది రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అనుమతులు ఇవ్వకపోతే మా కుటుంబాలకు ఆత్మహత్యలే శరణ్యం.  – ఎలిశెట్టి నాగేశ్వరరావు, రైతు, నిడమర్రు

పన్ను కూడా కట్టించుకుంటున్నారు 
నాకు 3 ఎకరాల జిరాయితీ పట్టా భూమి ఉంది. దానికి రెవెన్యూ అధికారులు ఇక్కడ పంట పొలం కింది ఏటా రూ. 300 పన్ను కూడా కట్టించుకుంటున్నారు. నా పొలం దిగువన ఉండటంతో పైనుంచి రొయ్య, చేపల చెరువుల నీరు రావడంతో వ్యవసాయం కూడా చేసుకోలేకపోతున్నాం. అందరితో పాటు సంప్రదాయ చేపల సాగుకు గట్టు వేసేందుకు ప్రయత్నిస్తుంటే అటవీ శాఖ అధికారులు మామూళ్లివ్వాలంటూ ఇబ్బందులు పెడుతున్నారు.  – జాలే శ్రీను, రైతు, నిడమర్రు

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)