ఆర్టీసీ ఉద్యోగుల అర్జీలు సకాలంలో పరిష్కారం

Published on Sun, 01/21/2024 - 05:51

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, క్రమశిక్షణ చర్యలపై అప్పీళ్ల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తూ వారి అర్జీల పరిష్కారానికి విధి విధానాలను ఖరారు చేసింది. ఈమేరకు ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జారీ చేసిన ఆదేశాలిలా ఉన్నాయి..

► ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను సకాలంలో మంజూరు చేయాలి
► క్రమశిక్షణ చర్యలపై అర్జీలను వెంటనే పరిష్కరించాలి
► సిక్‌ లీవుకు సంబంధించిన జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మంజూరు చేయాలి
► ఉద్యోగులపై దాడికి పాల్పడ్డవారిపై సత్వరం కఠిన చర్యలు తీసుకునేలా పర్యవేక్షించాలి
► కేఎంపీఎల్, ఈపీకేలపై ఉద్యోగులను కౌన్సెలింగ్‌కు పంపించడం నిలిపివేయాలి
► తక్కువ రాబడి వచ్చే బస్‌ షెడ్యూళ్లను రీ షెడ్యూల్‌ చేయాలి

► బీఎస్‌ 4, బీఎస్‌ 6 వాహనాల వీల్‌బోల్ట్‌ మెషిన్లు, మయాటిక్‌ గన్స్, ఎలక్ట్రికల్‌ పరికరాలను అన్ని గ్యారేజీలలో అందుబాటులో ఉంచాలి
► ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలు, భోజనశాలలు పరిశుభ్రంగా ఉంచాలి
► మూడు, నాలుగు షెడ్యూళ్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలి
► వైఫల్యాలను కారణంగా చూపుతూ గ్యారేజ్‌ ఉద్యోగులను బదిలీ చేయకూడదు
► తగిన శిక్షణ లేకుండా డ్రైవర్లకు టిమ్‌ డ్యూటీలను అప్పగించకూడదు
► జీతాల కోత విధిస్తూ సెలవులు మంజూరు చేయకూడదు.   

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)